బ్రేకింగ్: ప్రధాని ఇంటిపై డ్రోన్ అటాక్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి పై డ్రోన్ దాడి సంచలనం అయింది. ఆ సమయంలో ప్రధాని నెతన్యాహు దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

FILE PHOTO: Israeli Prime Minister Benjamin Netanyahu attends a discussion at the Israeli Parliament Knesset in Jerusalem July 17, 2024. REUTERS/Ronen Zvulun/File Photo
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి పై డ్రోన్ దాడి సంచలనం అయింది. ఆ సమయంలో ప్రధాని నెతన్యాహు దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా గ్రూపు ఉగ్రవాదులు ప్రయోగించిన మూడు డ్రోన్లు ఇజ్రాయెల్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చాయని ఇజ్రాయిల్ వర్గాలు తెలిపాయి.
ఒక డ్రోన్ ప్రధాని నెతన్యాహు ఇంటి కి సంబంధించిన ఒక భవనాన్ని ఢీ కొట్టిందని… ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయిల్ ప్రకటించింది. మరో రెండు డ్రోన్ల లను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. ఇటీవల హమాస్ చీఫ్ ను ఇజ్రాయిల్ బలగాలు హతమార్చడంతో ప్రధానికి భద్రతను కట్టుదిట్టం చేసారు.