బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, అత్యధికంగా అక్కడే
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. తెలంగాణాలోని ములుగు కేంద్రంగా భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. తెలంగాణాలోని ములుగు కేంద్రంగా భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3 గా నమోదు అయింది. పెద్దపల్లి, గోదావరిఖని సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్ లో స్వల్పంగా భూ ప్రకంపనాలు వచ్చాయి. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల్లో కూడా భూకంపాలు సంభవించాయి.
ఇక ఏపీలో కూడా ఈ భూకంప తీవ్రత కనిపించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లోని గంపలగూడెం విస్సన్నపేట మండలాల్లో ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రెప్పపాటు భూమి కంపించింది. పలు సెకన్ల పాటు కంపించింది అని స్థానికులు చెప్తున్నారు. ఇంట్లోని కుర్చిలు, వంట సామాగ్రి కదలడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసారు. ఇక చింతూరు ఏజెన్సీలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. చింతూరు, వి.అర్.పురం మండలాల్లో పలు చోట్ల భూమి కంపించింది. వి.అర్.పురం మండలం చొప్పల్లి లో భూమి కంపించింది. అర నిమిషం పాటు భూమి పంపించడం గమనార్హం.