బ్రేకింగ్: మాజీ సిఎం కన్నుమూత
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం అగ్రనేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూసారు. అనారోగ్యం కారణంగా ఆయన కలకత్తాలో తుది శ్వాస విడిచారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం అగ్రనేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూసారు. అనారోగ్యం కారణంగా ఆయన కలకత్తాలో తుది శ్వాస విడిచారు. 1944 మార్చి 1 వ తేదీన కోల్కతాలో జన్మించిన బుద్ధదేవ్ భట్టాచార్య… బెంగాల్ కు ఏడవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2001 నుండి 2011 వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 11 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన బుద్ధదేవ్ భట్టాచార్య… జ్యోతిబసు తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగాను కీలకంగా పని చేసిన బుద్ధదేవ్… 2011 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఓటమి తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. బుద్ధదేవ్ సీఎంగా ఉన్నప్పుడే బెంగాల్ లో టాటా కార్ల ఫ్యాక్టరీ రావడంతో ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా తృణామూల్,మావోయిస్టులు కలిసి ఉద్యమం చేపట్టారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ను ఓడించి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు చేపట్టారు.