బ్రేకింగ్: కేటిఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్ట్
మాజీ మంత్రి కేటిఆర్ కు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. హైడ్రా గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కబ్జాలను గత ప్రభుత్వం ప్రోత్సహించింది అంటూ సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
మాజీ మంత్రి కేటిఆర్ కు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. హైడ్రా గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కబ్జాలను గత ప్రభుత్వం ప్రోత్సహించింది అంటూ సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక హైడ్రాలో మన తన అనే భేదం లేకుండా అధికారులు దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేటిఆర్ కు సంబంధించింది అని చెప్తున్న జన్వాడ ఫాం హౌస్ మీద హైడ్రా దృష్టి పెట్టింది.
ఫాం హౌస్ ను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసి కూల్చివేయద్దు అని కోరారు. ఈ నేపధ్యంలో కూల్చివేతలపై హైడ్రాకు ఊరట లభించింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటీషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత పై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలు ఇచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పని చేస్తుందని హైకోర్ట్ కు ప్రభుత్వ లాయర్ నివేదించారు. చెరువులు, నాళాల రక్షణ తమ ధ్యేయం అని స్పష్టం చేసారు.