బ్రేకింగ్: ఏపీలో లిక్కర్ పాలసీ నేడే…?
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభం అయింది. సూపర్ సిక్సులో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై నేడు కేబినెట్లో చర్చ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభం అయింది. సూపర్ సిక్సులో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకంపై నేడు కేబినెట్లో చర్చ జరగనుంది. 18 నుంచి 59 ఏళ్లలోపున్న మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది ప్రభుత్వం. మహిళలకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశం పై చర్చ జరుగుతోంది. వడ్డీ లేని రుణాల కింద రూ. 3 లక్షలు మాత్రమే గత ప్రభుత్వం చెల్లించింది. పేదరికం లేని సమాజం నిర్మాణంలో భాగంగా పీ-4 పైనా నేడు కేబినెట్లో చర్చ జరుగుతుంది.
పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై చర్చించనున్న మంత్రి వర్గం… ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ. 300 కోట్లు విడుదలపై కూడా చర్చించే అవకాశం ఉంది. బుడమేరు ముంపు, వరద సాయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చ జరిగే అవకాశం కనపడుతోంది. మద్యం పాలసీపై కెబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కెబినెట్ సమీక్షిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రి వర్గం ఆమోద ముద్ర వేస్తోంది. ఇసుక పాలసీ అమలు వంటి వాటి పైనా కెబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.