BREAKING NEWS : కాలుజారి పడ్డ కేసీఆర్ : విరిగిన తుంటి ఎముక
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇంట్లో కాలు జారి పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన యశోదాకు తరలించారు.

Seemandhras who survived KCR in Telangana..
Ex-CM KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి సోమాజీగూడ యశోదాకు తరలించారు కుటుంబసభ్యులు. రాత్రి 2.30-3 గంటల మధ్యలో హాస్పిటల్ కి వెళ్ళారు కేసీఆర్. మధ్య రాత్రి తన పంచె తగిలి కేసీఆర్ కాలుజారి పడినట్టు తెలుస్తోంది. బాత్రూమ్ లో కాలి జారి పడటంతో తుంటి ఎముక విరిగిందని యశోద డాక్టర్లు తెలిపారు. ఎడమ కాలుకి గాయం అయినట్టు సమాచారం. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. నిన్న రాత్రి కేసీఆర్ హాస్పిటల్ కి వచ్చాక కొన్ని టెస్టులు నిర్వహించారు యశోదా డాక్టర్లు. మళ్ళ ఇవాళ ఉదయం టెస్టులు చేసి… ఉదయం 11 గంటలకు కాలుకు సర్జరీ చేస్తారు.