బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ కు ఎన్టీఆర్ థాంక్స్, మీ సపోర్ట్ మరువలేనిది

మరో వారం రోజుల్లో దేవర జాతర మొదలు కానుంది. సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ తో పాటుగా సినిమా ప్రేక్షకులు గంటలు లెక్క పెడుతున్నారు. ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తు దేవర సినిమా ఒక ఎత్తు. ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ మార్కెట్ భారీగా జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 21, 2024 | 03:28 PMLast Updated on: Sep 21, 2024 | 3:28 PM

Breaking Ntr Thanks Pawan Kalyan Your Support Is Unforgettable

మరో వారం రోజుల్లో దేవర జాతర మొదలు కానుంది. సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ తో పాటుగా సినిమా ప్రేక్షకులు గంటలు లెక్క పెడుతున్నారు. ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తు దేవర సినిమా ఒక ఎత్తు. ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ మార్కెట్ భారీగా జరుగుతోంది. ప్రీ బుకింగ్స్ కోసం విదేశాల్లో జనాలు క్యూ కడుతున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనపడే అవకాశం ఉంది. ఇక రెండు పార్ట్ లు గా వచ్చే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఏ రేంజ్ లో నెగటివ్ ప్రచారం జరుగుతున్నా సినిమా యూనిట్ మాత్రం ఏ విధంగా కూడా భయపడటం లేదు. దర్శకుడు కొరటాల శివ కూడా సినిమా విడుదలపై చాలా నమ్మకంగా ఉన్నారు. కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందా, యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. మొదటి రోజు టికెట్ ల కోసం ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ప్రీ బుకింగ్ మార్కెట్ ఓపెన్ అయితే చాలు టికెట్స్ కొనడానికి సిద్దమవుతున్నారు.

ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే సినిమా విడుదల రోజు ఆరు షో లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ చంద్రబాబు సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌.. దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు మరియు తెలుగు సినిమాకి నిరంతరం మద్దతు తెలుపుతున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఎక్స్ లో పోస్ట్ చేసారు. వీరితో పాటుగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి కూడా నా కృతజ్ఞతలు అంటూ జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ ఎక్స్ లో పోస్ట్ చేసారు.