బ్రేకింగ్: జానీ మాస్టర్ బాధితురాలి వద్దకు భారీగా పోలీసులు
గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారంలో త్వరలోనే జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుంటారనే వార్తలు నిజం అయ్యాయి.
గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారంలో త్వరలోనే జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుంటారనే వార్తలు నిజం అయ్యాయి. అరెస్ట్ నుంచి రక్షించుకోవడానికి జానీ మాస్టర్ బెంగళూరు, గోవా, లడఖ్ ఇలా తిరిగారు అంటూ వార్తలు వచ్చాయి. ముందు ఆయన బెంగళూరులో ఉన్నారని తర్వాత లడఖ్ వెళ్ళారని ఆ తర్వాత గోవాలో ఉన్నారని కథనాలు వచ్చాయి. చివరకు ఆయన బెంగళూరు నుంచి గోవా వెళ్ళగా అక్కడ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వస్తున్నారు.
ఇక జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు పోలీసులు. మూడు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ఆమెపై ఏమైనా చర్యలకు దిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీ పై పోక్సో కేసు నమోదు చేసారు.
పోక్సో కేసు కు ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. గత మూడు రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు జాని మాస్టర్ పరారు కావడంతో అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు మహిళా కమిషన్ను ఆశ్రయించిన బాధితురాలు… తనకు న్యాయం చేయాలని కోరారు. ఇక మూడు గంటల పాటు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసారు. బాధితురాలికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించింది.