బ్రేకింగ్: గణేష్ నిమజ్జనంపై రేవంత్ గుడ్ న్యూస్
ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. బారికేడ్ లను తొలగించి భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. నిన్న ట్యాంక్ బండ్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి.

ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. బారికేడ్ లను తొలగించి భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. నిన్న ట్యాంక్ బండ్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి. బారికేడ్లను తొలగించి నిమజ్జనం ఇక్కడే చేయాలి అని డిమాండ్లు చేసింది. దీనితో ఎప్పటిలాగే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనానికి భారీ క్రేన్లతో వివిధ శాఖల అధికారులు సమాయత్తం అవుతున్నారు.
భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అలాగే వినాయక విగ్రహాలకు జియో ట్యాగింగ్ కూడా చేసారు. అలాగే ట్యాంక్ బ్యాండ్ పై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసారు.