బ్రేకింగ్: గుడ్లవల్లేరు కాలేజ్ కి షర్మిల
గుడ్లవల్లేరు కాలేజి ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆడపిల్లల బాత్ రూముల్లో హెడెన్ కెమెరాలు పెట్టడం 300 లకు పైగా వీడియోలు ఉన్నాయని విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె మండిపడ్డారు.
గుడ్లవల్లేరు కాలేజి ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆడపిల్లల బాత్ రూముల్లో హెడెన్ కెమెరాలు పెట్టడం 300 లకు పైగా వీడియోలు ఉన్నాయని విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె మండిపడ్డారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలి అని డిమాండ్ చేసారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు ఆమె. చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందన్నారు.
ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే… వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం అని ఆరోపించారు షర్మిల. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యం అన్నారు ఆమె. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం అని మండిపడ్డారు. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలన్నారు.
తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలని సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలని షర్మిల డిమాండ్ చేసారు. బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే అన్ని స్పష్టం చేసారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తా అని హెచ్చరించారు.