బ్రేకింగ్: తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ మాకు తెలీదు: కేంద్రం
తెలంగాణాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది.
తెలంగాణాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్ట్ లో కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ టాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని కౌంటర్లో పేర్కొన్న కేంద్రం… ఫోన్ టాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అని స్పష్టం చేసింది. ఫోన్ టాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని పేర్కొంది.
టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ టాపింగ్ వ్యవహారంపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఫోన్ టాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు చూపెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఫోన్ టాపింగ్ చేయడానికి కారణాలు చూపెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ కమిటీలు ముందు పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఫోన్ టాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీ ఆమోదిస్తే 60 రోజుల వరకు అనుమతి ఉందని గరిష్టంగా 180 రోజుల వరకు పొడిగించుకోవచ్చని స్పష్టం చేసింది. కౌంటర్ రూపంలో హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది.