సారాతో బ్రేకప్ ? హీరోయిన్ తో గిల్ డేటింగ్

మన క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో డేటింగ్ చేయడం మూమూలే... వీటిలో కొన్ని పెళ్ళి వరకూ వెళితే.. మరికొన్ని డేటింగ్ తోనే ఆగిపోతుంటాయి. తాజాగా టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ డేటింగ్ పుకార్లు వైరల్ గా మారాయి. గిల్ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2024 | 02:10 PMLast Updated on: Sep 12, 2024 | 2:10 PM

Breakup With Sarah Gill Dating The Heroine

మన క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో డేటింగ్ చేయడం మూమూలే… వీటిలో కొన్ని పెళ్ళి వరకూ వెళితే.. మరికొన్ని డేటింగ్ తోనే ఆగిపోతుంటాయి. తాజాగా టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ డేటింగ్ పుకార్లు వైరల్ గా మారాయి. గిల్ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుభ్‌మన్ గిల్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ అవనీత్ కౌర్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలో ఇద్దరూ కలిసి కనిపించారు.గత ఏడాది వీరిద్దరూ లండన్‌లో తిరిగిన ఫోటోలు కూడా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే గిల్ మొన్నటి వరకూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీద్దరూ పలు పార్టీల్లో కనిపించడంతో పుకార్లు షికారు చేశాయి. గిల్ సోదరితో కలిసి సారా టెండూల్కర్ లేట్ నైట్ పార్టీలకు హాజరవ్వడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది. అటు సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు ఫాలో అవుతూ కామెంట్స్ చేసుకోవడంతో ఇక పెళ్ళి ప్రకటనే అనుకున్నారు. అయితే ఇప్పుడు సారాతో బ్రేకప్ అయిపోయినట్టు భావిస్తున్నారు. తాజాగా గిల్ పుట్టినరోజు కూడా సారా విషెస్ చెప్పలేదు. దీంతో ఆమెకు బ్రేకప్ చెప్పి హీరోయిన్ తో డేటింగ్ మొదలుపెట్టాడని చెప్పుకుంటున్నారు.