Amarnath Yatra : ఈనెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర షూరు.. భారీ భద్రత కల్పించనున్న BRO
అమర్ నాధ్ యాత్ర అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నది. ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం శ్రీఅమర్‌నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు.
హిందువులు అందరూ కొలిచే ఆ పరమశివుని మంచు కొండ యాత్ర.. అమర్ నాథ్ యాత్ర. మరో వారం రోజుల్లో అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా భక్తులకు అమర్‌నాథ్ మంచు లింగ దర్శనంకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు LG మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచికగా ఇవాళ నిర్వహించిన ప్రథమ పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో నిఘా పెంచినట్లు ఏడీజీపీ ఆనంద్ జైన్ చెప్పారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాగా ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగనుంది.
అమర్ నాధ్ యాత్ర అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నది. ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం శ్రీఅమర్‌నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు. ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల పైచిలుకు భక్తులు వచ్చే అవకాశం ఉందని శ్రీఅమర్‌నాథ్ క్షేత్ర బోర్డు తెలిపింది. మరో వైపు యాత్రకు వచ్చే భక్తులందరు కూడా ముందుగా యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సమాచారన్ని శ్రీ అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అమర్ నాథ్ యాత్రికులకు భారీ భద్రతా..
అమర్ నాథ యాత్రకు వచ్చే భక్తులకు శ్రీఅమర్‌నాథ్ క్షేత్ర బోర్డు భారీ భద్రతను కల్పించనుంది. ఈ ఏడాది అమర్ నాథ యాత్రికులకు RFID కార్డ్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ కార్డులో అమర్ నాథ్ యాత్రిక వెళ్లే వైల్ లోకేషన్ తో పాటుగు ఆ యాత్రికిడికి సంభందించిన పూర్తి సమాచారం పొందుపరిచి ఉంటుంది. అమర్ నాథ్ లో యాత్రికులు ఎవరైన తప్పిపోయిన వారిని అనుగునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మరో వైపు యాత్రికు వచ్చే ప్రతి భక్తుడికి రూ. 5 లక్షల ఇన్స్యూరెన్స్ ఇవ్వనుంది జమ్మూ ప్రభుత్వం..
అమర్నాథ్ యాత్రపై.. హోంశాఖ, రక్షణ శాఖ సమీక్ష..
జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆనంద్ జైన్.. మాట్లాడుతు.. శ్రీనగర్‌లోని రాజ్‌భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పూజలో పాల్గొన్నారు.
గడచిన రెండేళ్లలో యాత్రికులకు సౌకర్యాలు చాలా మెరుగుపడినట్లు ఆయన చెప్పారు. మంచు లింగం ఉండే గుహతో వెళే రహదారులను మెరుగుపరిచినట్లు ఆయన చెప్పారు. కొన్ని ఇరుకు మార్గాలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఈ ఏడాది వెడల్పు చేసినట్లు సిన్హా తెలిపారు. ఈసారి యాత్రికులు మరింత సులభంగా, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. అన్ని మతాలకు చెందిన ప్రజలు అమర్‌నాథ్ యాత్రను బలపరుస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇద్దరు ఈ యాత్రపై సమీక్ష నిర్వహించారు. దీంతో (BRO) భారత ఆర్మీ ఈయాత్రకు వచ్చే వారికి కట్టు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.