కోహ్లీకి అంత సీన్ లేదు ఆసీస్ మాజీ స్పిన్నర్ కామెంట్స్
ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నది విరాట్ కోహ్లీనే... ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న కొన్ని రికార్డులను విరాట్ చాలా ఈజీగా అధిగమించాడు. వరల్డ్ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేస్తాడని చాలా మంది అంచనా వేస్తున్నారు.
ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నది విరాట్ కోహ్లీనే… ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న కొన్ని రికార్డులను విరాట్ చాలా ఈజీగా అధిగమించాడు. వరల్డ్ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేస్తాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా కోహ్లి తన లయ కోల్పోయాడని, సచిన్ రికార్డులను అందుకోలేడని అభిప్రాయపడ్డాడు. సచిన్ 200 టెస్టుల్లో 15921 పరుగులు చేయగా… అందులో 51 శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం
విరాట్ కోహ్లి 114 టెస్టుల్లో 8871 పరుగులతో 29 సెంచరీలు సాధించాడు. అయితే గత కొన్నాళ్లుగా కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్‌లో శతకాల మార్క్ అందుకోలేకపోతున్నాడు.
2020 నుంచి ఇప్పటి వరకూ కేవలం రెండు సెంచరీలే సాధించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ నిరాశపరిచాడు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు భారత్ ఆడే 9 టెస్టుల్లో కోహ్లి పుంజుకుంటే తిరిగి రికార్డుల రేసులోకి వస్తాడని, లేకపోతే సచిన్ రికార్డుల దగ్గరకు కూడా చేరుకోలేడని తేల్చేశాడు. ఇదిలా ఉంటే సచిన్ రికార్డును ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ అధిగమించే ఛాన్స్ ఉందని బ్రాడ్ హాగ్ అంచనా వేశాడు. గత కొన్నాళ్లుగా జో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. 146 టెస్టుల్లో 12402 పరుగులు చేయగా.. అందులో 34 సెంచరీలు ఉన్నాయి.