BRS-BSP: బీఆర్ఎస్.. బీఎస్పీ పొత్తు.. ఏ సీట్లు ఎవరికి..
ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఒప్పందం ప్రకారం.. బీఎస్పీ రెండు స్తానాల్లో పోటీ చేయనుంది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. దీనిలో భాగంగా బీఎస్పీ హైదరాబాద్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
BRS-BSP: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే పొత్తుపై ప్రకటన చేశారు. ఇరు పార్టీల చర్చల అనంతరం.. ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఒప్పందం ప్రకారం.. బీఎస్పీ రెండు స్తానాల్లో పోటీ చేయనుంది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుంది. దీనిలో భాగంగా బీఎస్పీ హైదరాబాద్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల రేపే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా
ఇందులో నాగర్ కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎంపీగా పోటీ చేస్తారు. హైదరాబాద్ అభ్యర్థిని నిర్ణయించాల్సి ఉంది. ఇక బీఆర్ఎస్ పోటీ చేయబోయే 15 స్తానాలకుగాను 11 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. నాగర్ కర్నూల్ టిక్కెట్ బీఆర్ఎస్‌కు కేటాయించడాన్ని తాము గౌరవిస్తున్నామని నాగర్‌కర్నూలు బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. బీఎస్పీ విజయం కోసం అందరం కలిసి కృషి చేస్తామన్నారు. వంద రోజుల కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు బీఆర్‌ఎస్, బీఎస్పీ నేతలు.
బీఎస్పీ పోటీ చేసే స్థానాలు
హైదరాబాద్- అభ్యర్థిని ఎంపిక చేయాలి
నాగర్‌కర్నూల్ – ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
బీఆర్‌ఎస్ అభ్యర్థులు వీళ్లే..
చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్- కడియం కావ్య
జహీరాబాద్- గాలి అనిల్‌కుమార్
నిజామాబాద్- బాజిరెడ్డి గోరవర్ధన్ రెడ్డి
ఖమ్మం- నామా నాగేశ్వర్‌రావు
మహబూబాబాద్- మాలోత్ కవిత
కరీంనగర్- బోయినపల్లి వినోద్‌కుమార్
పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్
మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్‌గిరి- రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్- ఆత్రం సక్కు