BRS MP LIST: 16 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. లిస్ట్ ఇదే..
శనివారం.. భువనగిరి, నల్గొండ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. దీంతో హైదరాబాద్ స్థానం మినహా అన్ని స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది.

Let's change it to TRS again! Sentiment Govinda with BRS !!
BRS MP LIST: తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకుగాను 16 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. శనివారం.. భువనగిరి, నల్గొండ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. దీంతో హైదరాబాద్ స్థానం మినహా అన్ని స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు నేతలెవరూ పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
Pawan Kalyan: పి.గన్నవరం టిక్కెట్ జనసేనకే.. రెండు స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన..
కొందరు సిట్టింగ్‌లు ఇతర పార్టీలకు జంప్ కాగా.. మరికొందరు సిట్టింగ్‌లు పోటీ నుంచి తప్పుకొన్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు మాత్రమే ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీకి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. 16 మందిలో ఐదుగురు బీసీలకు అవకాశం దక్కింది. అలాగే ఇద్దరు రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు కూడా ఈసారి అవకాశం కల్పించారు. మొన్నటివరకు బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ తరఫున నాగర్ కర్నూల్ నుంచి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన 16 మంది అభ్యర్థుల జాబితా ఇది.
సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్
ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
కరీంనగర్ – వినోద్‌కుమార్
జహీరాబాద్ – అనిల్‌కుమార్
భువనగిరి – క్యామ మల్లేశ్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
మహబూబాబాద్ – మాలోత్ కవిత
చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్ – డాక్టర్ కడియం కావ్య
మెదక్ – వెంకట్రామిరెడ్డి
నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
నాగర్‌కర్నూల్ – ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి