BRS, KTR : బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. ప్రచార వాహనం నుంచి కింద పడ్డ మంత్రి కేటీఆర్..
ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

BRS campaign failed Minister KTR fell down from the campaign vehicle
ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రచార వాహనం స్పీడ్ గా వెళుతున్న సమయంలో ఒక్కసారిగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో .. ప్రచార రథం పైన ఉన్న గ్రిల్ విరిగిపోయి.. మంత్రి కేటీఆర్ సహా.. సురేశ్ రెడ్డి, జీవన్ రెడ్డి, వాహనం పై నుంచి కిందపడిపోబోయారు. వెంటనే మంత్రి గన్ మెన్లు కేటీఆర్ ను గట్టిగా పట్టుకున్నారు. ఈ సంఘటనతో మంత్రి కేటీఆర్ పాటు సహచర నేతలు ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో కేటీఆర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. కేటీఆర్ కడుపు గట్టిగా పాటల బాక్స్ లు ఒత్తుకున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డికి.. ఎంపీ సురేష్ రెడ్డి కాస్తా ఎక్కువ గాయాలు అయినట్లు సమాచారం.
ఈ ఘటనకు ముందు ప్రచారం వాహనం పై దాదాపు 10 మంది దాకా ఉన్నారు. సడన్ బ్రేక్ వేయడంతో కేటీఆర్ తో సహా అందరూ పట్టు కోల్పోయి జీవన్ రెడ్డి,సురేష్ రెడ్డి కింద పడిపోగా.. మంత్రి కేటీఆర్ ప్రచార వాహనంపై పడిపోయారు. “ఈ ప్రమాదం పై మంత్రి స్పందిస్తూ.. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని కోరారు”. ప్రమాదం తర్వాత కేటీఆర్ కొడంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.