KCR FUTURE : ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ.. అయోమయంలో కేసీఆర్…

ఓడలు బళ్ళవుతాయంటే ఇదేనేమో. మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు కేసీఆర్ (KCR) పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచంగా తయారైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2024 | 12:05 PMLast Updated on: Mar 08, 2024 | 12:05 PM

Brs Empty After Election Kcr Is Confused

ఓడలు బళ్ళవుతాయంటే ఇదేనేమో. మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు కేసీఆర్ (KCR) పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచంగా తయారైంది. పదేళ్ళ పాటు మంత్రులు, ఎంపీలుగా… దర్జాగా హోదాలను అనుభవించిన వాళ్ళు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. పోతే పోనీ… అంటూ పాడుకోవడం తప్ప కేసీఆర్ ఏమీ చేయలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత బీఆర్ఎస్ నుంచి సగానికి పైగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని టాక్స్ నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ ఆఫీసులకు అద్దెలు కట్టకపోవడంతో మూత పడుతున్నాయి.

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తే… దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. కానీ ఇక్కడ కారు చక్రాలు ఊడిపోయి షెడ్డుకుపోయింది. జనం కాంగ్రెస్ చేతికి పవర్ ఇచ్చారు. దాంతో గులాబీ లీడర్లు ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. ముగ్గురు ఎంపీలు జంప్ అయ్యారు. ఇంకొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ముందు లేదంటే తర్వాత గానీ సగానికి పైగా BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారన్న టాక్ నడుస్తోంది. పార్టీని వీడుతున్న వాళ్ళని కనీసం ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారు కేసీఆర్. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో రోజుకో BRS ఎమ్మెల్యే …సీఎం రేవంత్ ను, ఆయన సలహాదారులను కలుస్తున్నారు.

ఇప్పటికప్పుడు 12 మంది హస్తం పార్టీలో జాయినింగ్ రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ 26 మందిని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు తమ ఎమ్మెల్యేలను చేర్చుకొని CLP ని లేకుండా చేసిన కేసీఆర్ కు అదే స్థాయిలో దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. BRSLP విలీనం చేయించడంపైనే ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు, ధర్నాల్లోనూ గులాబీ లీడర్లు, కార్యకర్తలే పాల్గొనడం లేదు. LRS మీద ధర్నాకు పిలుపు ఇస్తే… నాలుగైదు చోట్ల తప్ప ఎక్కడా స్పందన లేదు. హరీష్, కేటీఆర్, కవిత… మీటింగ్స్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా… ఛాలెంజ్ లు విసురుతున్నా… జనం మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాల్లో జగం సీట్లల్లో నిలబడటానికి బీఆర్ఎస్ కి అభ్యర్థులే దొరకట్లేదు. ఎలాగొలా నలుగుర్ని రెడీ చేసినా… మిగతా చోట్ల వెతుక్కోవాల్సి వస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్ తీసుకొని… ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చుపెట్టుకున్నా… గెలుస్తామన్న గ్యారంటీ లేకపోవడంతో చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు కూడా కష్టమే అంటున్నారు. అందుకే బీజేపీతో దోస్తీకి ప్రయత్నించి విఫలమైన కేసీఆర్… చివరకు తెలంగాణలో ఉనికే లేని బీఎస్పీతో జతకట్టారు. రేపో మాపో ప్రజాశాంతి పార్టీతోనూ పొత్తులు పెట్టుకుంటారేమోనని… సోషల్ మీడియాలో మీమ్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి.

ఇక లోక్ సభ ఎన్నికలకు ముందే BRS ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టే ఛాన్సుంది. రాష్ట్రంలో గులాబీ పార్టీ పని అయిపోయిందనే సంకేతాలను జనంలోకి పంపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ ను నడిపే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో ఆఫీసులకు అద్దెకట్టకపోవడంతో కేసీఆర్ కు డెడ్ లైన్ పెట్టారు అక్కడి నేతలు. వారంలో తేల్చకపోతే తామంతా వేరే పార్టీ చూసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.