BRS : తెలంగాణ దశాబ్ది ఉత్సవావల వేళ బీఆర్ఎస్ శుభ వార్త.. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో BRS గెలుపు
మహబూబ్ నగర్ (Mahbubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మహబూబ్ నగర్ (Mahbubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా అందులో 27 చెల్లనివిగా అధికారులు గుర్తించారు. మరోవైపు కౌంటింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ఇక సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకా.. మొదటి రిజల్ట్ లోనే అది కూడా సొంత సీఎం సొంత జిల్లాలో ఓడిపోవడం ఓకింత చర్చలకు దారితీస్తుంది.
ఇక తిరిగి ఎమ్మెల్సీ స్థానాన్ని తాము నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఉమ్మడి మహబ్‌గనర్ స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత ఏడాది నవంబర్‌లో పార్టీ మారారు. ఆ తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. దాంతో.. ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.