BRS KHALI : పక్క రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఖాళీ.. లీడర్లు వేరే పార్టీల్లోకి జంప్

తెలంగాణలో (Telangana) పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్(TRS)... బీఆర్ఎస్ (BRS) గా పేరు మార్చి దేశమంతటా విస్తరించాలని కలలు గన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. పొరుగున్న ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర(Maharashtra), ఒడిశాల్లో... మంత్రులు, పార్టీ లీడర్లతో భారీ కాన్వాయ్ తో వెళ్ళి తెగ హడావిడి చేశారు. ప్రధాని మోడీ మీద కారాలు, మిరియాలు నూరాడు కేసీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 12:08 PMLast Updated on: Jan 30, 2024 | 12:08 PM

Brs Is Empty In Neighboring States Leaders Jump To Other Parties

తెలంగాణలో (Telangana) పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్(TRS)… బీఆర్ఎస్ (BRS) గా పేరు మార్చి దేశమంతటా విస్తరించాలని కలలు గన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. పొరుగున్న ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర(Maharashtra), ఒడిశాల్లో… మంత్రులు, పార్టీ లీడర్లతో భారీ కాన్వాయ్ తో వెళ్ళి తెగ హడావిడి చేశారు. ప్రధాని మోడీ మీద కారాలు, మిరియాలు నూరాడు కేసీఆర్. కానీ పార్టీకి బేస్మెంట్ అయిన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లోనే బొక్క బోర్లా పడింది. దాంతో ఇప్పుడు పొరుగు రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదు. తమ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఏదో పొడిచేస్తోందని ఆశపడ్డ నేతలు చివరకు వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.

టీఆర్ఎస్… బీఆర్ఎస్ గా మారాక ఆ పార్టీకి తెలంగాణలో ఓటమి ఎదురైంది. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి… కేసీఆర్ దాన్ని వదిలిసే దేశం పట్టుకుపోతున్నారని జనం అనుకున్నారు. అహంకారం, జనాన్ని పార్టీ లీడర్లు, కార్యకర్తలను లెక్కచేయకపోవడం… ఏదైతే ఏం… బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో మళ్ళీ పార్టీ పేరును టీఆర్ఎస్ చేయాలని… నియోజకవర సమీక్షా సమావేశాల్లో కార్యకర్తలు, లీడర్ల నుంచి డిమాండ్ వస్తోంది. అనారోగ్యంతో రెస్ట్ తీసుకొని మళ్ళీ యాక్టివ్ అవుతున్న గులాబీ బాస్ కేసీఆర్… ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వచ్చే నెలలో తేలనుంది.

బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో… పొరుగు రాష్ట్రాల్లోని లీడర్లకు ఏం చేయాలో తెలియట్లేదు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ ఉంటుందా… ఉండదా అన్న దానిపై ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటనాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) ముందు నుంచీ ఏపీలో చడీ చప్పుడు ఆగిపోయింది. ఏపీ BRS అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) మాట్లాడటం లేదు. తెలంగాణ ఎన్నికల టైమ్ లో ఆయన్ని ప్రెస్ మీట్స్ పెట్టొద్దని చెప్పినట్టు టాక్. తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుందని గులాబీ బాస్ భయపడ్డారట. తోటతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా అప్పట్లో BRS లో చేరారు. గుంటూరులో పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు మాత్రమే కాస్త హడావిడి నడిచింది. తర్వాత ఏమీ లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక…విస్తరిస్తారన్న నమ్మకం కూడా ఇద్దరు లీడర్లకు లేదు. అందుకే తోట చంద్రశేఖర్, రావెల్ కిషోర్ బాబు వేరే పార్టీలు చూసుకుంటున్నట్టు టాక్ వస్తోంది. తోట చంద్రశేఖర్ కుటుంబం నుంచి టిక్కెట్ వచ్చేలా వేరే పార్టీలో పైరవీ చేస్తున్నట్టు సమాచారం. అది కన్ఫమ్ అయితే బీఆర్ఎస్ రిజైన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రావెల కూడా అతి తొందర్లోనే వైసీపీలో చేరతారని చెబుతున్నారు. దాంతో ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్టే.

మహారాష్ట్ర సంగతి చూస్తే… అక్కడ అన్ని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిలబడుతుందని రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ఇప్పటికీ చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. గతంలో స్థానిక సంస్థల్లో 15 స్థానాలు గెలవడంతో… తెలంగాణ బోర్డర్ లోని నాందేడ్, నాగ్ పూర్, ఔరంగాబాద్ ఏరియాల్లో బీఆర్ఎస్ సంగతి కొంతవరకు జనానికి తెలుసు. ఆ రాష్ట్రంలో 15 జిల్లాలకు పార్టీని విస్తరించి… 48 లోక్ సభ నియోజకవర్గాల్లో బలం చూపించుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల జోలికి వెళ్ళొద్దని కేటీఆర్, హరీశ్ రావుతో పాటు కొందరు సీనియర్లు కూడా కేసీఆర్ కు చెప్పారట.

ఒడిశాలో మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరామ్ పంగీబీఆర్ఎస్ లో చేరారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గమాంగ్, ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఓడిశాలో ఫేడవుట్ అయిన లీడర్లు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి… పార్టీ భారీగా ఫండ్ ఇస్తే మళ్ళీ ఓ వెలగవచ్చని కలలు గన్నారు. కానీ కేసీఆర్ పైసల ముచ్చట తేల్చకపోవడంతో ఒడిశా బీఆర్ఎస్ లీడర్లు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. కర్ణాటకలో అడుగుపెట్టాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్లాన్ వేశారు. మాజీ సీఎం కుమారస్వామితో రాయబారాలు నడిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దు ఏరియాల్లో అయినా పోటీ చేయాలనుకున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ కి జేడీఎస్ చీఫ్ కుమార్ స్వామి కూడా హాజరయ్యారు. కానీ సరిగ్గా కర్ణాటక ఎన్నికల ముందు మనసు మార్చుకున్నారు. కుమారస్వామి బీజేపీతో జత కట్టడంతో… కర్ణాటకలో BRS ఎంట్రీకి బ్రేక్ పడింది. ఇలా ఒక్కో రాష్ట్రం బీఆర్ఎస్ చేజారిపోతోంది.

రాష్ట్రాల్లో ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా… కేవలం మోడీ టార్గెట్ గానే జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవుదామని కేసీఆర్ అనుకున్నారు. మోడీ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికారు. పొరుగు రాష్ట్రాల్లో పార్ట్ టైమ్ గా పనిచేసే చిన్న చిన్న లీడర్లను హైదరాబాద్ కు తీసుకొచ్చి… కేసీఆర్ అంతటి దేశ్ కీ నేత మరొకరు లేరు అని పొగిడించుకున్నారు. కానీ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ కి పొరుగు రాష్ట్రాల్లో మనుగడ లేకుండా పోయింది.