KTR: యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు పెట్టిన కేటీఆర్.. ఏయే ఛానెల్స్ అంటే..
ఈ పది ఛానెల్స్ కొన్ని రోజల నుంచి బీఆర్ఎస్ పార్టీ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయనేది కేటీఆర్ వాదన. కేవలం పార్టీ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఈ ఛానెల్స్ తమను టార్గెట్ చేశాయంటున్నారు కేటీఆర్.
KTR: బీఆర్‌ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మీద మాజీ మంత్రి కేటీఆర్ కేసు పెట్టారు. ఆయా ఛానెల్స్‌కు లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఈ ఛానెల్స్ బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయంటూ చెప్పారు కేటీఆర్. ఛానెల్స్ పేర్లు వాళ్లు పబ్లిష్ చేసిన వీడియో లింక్స్‌ను కూడా ఫిర్యాదులో క్లియర్‌గా మెన్షన్ చేశారు.
AP DSC: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా..
మహాన్యూస్, ఐన్యూస్, సీఆర్ న్యూస్, మన తొలివెలుగు టీవీ, మనం టీవీ, పాలిట్రిక్స్, రేవంత్ దండు, వైల్డ్ వోల్ఫ్ న్యూస్, రెడ్ టీవీ, యూట్యూబ్. ఇలా మొత్తం 10 ఛానెల్స్‌కు నోటీసులు పంపించారు. ఈ పది ఛానెల్స్ కొన్ని రోజల నుంచి బీఆర్ఎస్ పార్టీ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయనేది కేటీఆర్ వాదన. కేవలం పార్టీ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఈ ఛానెల్స్ తమను టార్గెట్ చేశాయంటున్నారు కేటీఆర్. గతంలో కూడా ఈ ఛానెల్స్ గురించి కేటీఆర్ ప్రస్తావించారు. కానీ ఎక్కగా ఛానెల్స్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు. ఇలాంటి వార్తలు పెట్టొంద్దంటూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. మరోసారి తన గురించి గానీ.. బీఆర్‌ఎస్ పార్టీ గురించి కానీ తప్పుడు వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ చెప్పారు. ఇప్పుడు అన్నంతపనీ చేశారు. 10 యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు పెట్టారు. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు కావాలని చేయిస్తున్న పనులు అనేది కేటీఆర్ పాయింట్.
వీళ్లకి అధికార పార్టీ నుంచి డబ్బులు అందుతున్నాయి అనేది కూడా కేటీఆర్ ఆరోపణ. నిజంగానే వీళ్ల వెనక ఎవరైనా ఉన్నారా.. లేక వీళ్లే ఇలా చేస్తున్నారా అన్న సంగతి పక్కన పెడితే. ఈ ఛానెల్స్ మాత్రం బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. మరి కేటీఆర్ ఫిర్యాదుతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ కేసుతో ఐనా వీడియోలు ఆగుతాయా లేదా అనేది చూడాలి.