బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేశారు.. కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అక్రమంగా లాక్కుందని.. ఈసారి పరిస్థితి వేరుగా ఉందని అన్నారు.

BRS MLAs called me.. Renuka Chaudhary, former Union Minister of Congress
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అక్రమంగా లాక్కుందని.. ఈసారి పరిస్థితి వేరుగా ఉందని అన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని.. స్వయంగా తనకు కూడా కొందరి నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. రేణుకా చౌదరికి ఫోన్ చేసిన వారు ఆమెతో..ఇలా అన్నారు. తమను మర్చిపోవద్దు, తమను గుర్తుంచుకోవాలని, అవసరమైతే తాము కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ అభ్యర్థులు అన్నారు. కాగా తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం లేదని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. దేశంలో ఎగ్జిట్ పోల్స్ చూస్తే అత్యధికంగా కాంగ్రెస్ కు ప్రజలు మొగ్గు చూపారు అని.. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు.
ఇక పోతే రేణుకా చౌదరికి ఫోన్ చేసిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అన్న ప్రశ్న పదే పదే ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ క్యాడర్ లో. వారు ఎవరో ఏ నియోజకవర్గంలో తెలియక.. బీఆర్ఎస్ నేతలు తల పట్టుకుంటున్నారు.