CM REVANTH REDDY: రేవంత్‌తో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కోమటిరెడ్డి మాటే నిజం అవుతుందా..?
30మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారంటూ కోమటిరెడ్డి పేల్చిన బాంబ్.. తెలంగాణ పాలిటిక్స్‌ను మరింత రసవత్తరంగా మార్చాయ్. ఇలాంటి పరిణామాల మధ్య రేవంత్‌తో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.
CM REVANTH REDDY: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పేలుతున్న మాటలు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాల నిలవదంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు అంటుంటే.. అలాంటి కుట్రలు చేస్తే తాము ఎంతకైనా సిద్ధమని హస్తం పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం సెగలు కక్కుతోంది. ఇక అటు మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయ్. 30మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారంటూ కోమటిరెడ్డి పేల్చిన బాంబ్.. తెలంగాణ పాలిటిక్స్‌ను మరింత రసవత్తరంగా మార్చాయ్.
YS SHARMILA: షర్మిలను నడిపిస్తోంది ఆయనేనా.. ఆమె ధైర్యం అదేనా..?
ఇలాంటి పరిణామాల మధ్య రేవంత్‌తో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావటం చర్చనీయాంశం అయింది. సీఎం ఇంట్లోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌తో భేటీ కావటం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు.. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని చెప్తున్నా.. ఈ సమావేశం రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో సంచలనం రేపాయ్. ఇక బీఆర్ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు.. 39 ముక్కలవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సంచలన కామెంట్లు చేశారు. 30మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఇలాంటి తరుణంలో.. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అదీ గులాబీ ఆఫీస్‌లో మీటింగ్ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్‌తో భేటీ కావడంతో.. కోమటిరెడ్డి మాటే నిజం అవుతుందా అనే చర్చ జరుగుతోంది.