BRS manifesto : బీఆర్ఎస్ నూతన మేనిఫెస్టో.. పథకాల వివరణ.

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రచారం మరింత పెంచింది. నేటి నుంచి అధికారికంగా కేసీఆర్ ఎన్నికల సమరానికి సన్నద్ధమైంది అని చెప్పవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2023 | 05:03 PMLast Updated on: Oct 15, 2023 | 5:03 PM

Brs New Manifesto Description Of Schemes

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రచారం మరింత పెంచింది. నేటి నుంచి అధికారికంగా కేసీఆర్ ఎన్నికల సమరానికి సన్నద్ధమైంది అని చెప్పవచ్చు. ఇవాళ ఒక్కరోజు 51 ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్ అందించింది. ఇవాళ సాయంత్రం హుస్నాబాద్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభ ద్వారా తెలంగాణలో ఎన్నికలు మరింత ఊపు తెచ్చేలా ఉన్నాయి. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో వివరణ..

హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు..

  • హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టాలనిఈ మేనిఫెస్టో లో పొందుపరిచారు. ఇది వరకే ఇండ్లు ఉన్నవారికి గృహలక్ష్మి కొనసాగిస్తూనే.. ఇండ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే జాగలు సమకూర్చుతాయి.

అగ్రవర్ణ పేదలకు 119 గురుకులాలు..

  • తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యకు పెద్దపీట వేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తాం.

దళితబంధును కొనసాగిస్తాం..

  • దళితబంధులో ఏలాంటి మార్పు లేకుండా తెలంగాణ వ్యాప్తంగా.. ప్రతి జిల్లా నుంచి 100 మందిని ఎంపిక చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధును అందిస్తాము.

రైతుబంధును రూ.16 వేలు చేస్తాం..

  • రైతుబంధు మొదటి సంవత్సరం రూ.12 వేలకు పెంచుతూ.. తర్వాత ప్రతి ఏడాదికి విడత వారీగా రూ. 16 వేలకు పెంచుతాం అన్నారు కేసీఆర్.

ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెన్షన్.. పెంపు మొత్తం రూ.5000లకు పెంపు..

  • తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు రూ. 5 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. వందల్లో ఉన్న పెన్షన్లలో ఉన్న స్కీంను వెయ్యి రూపాయాలకు తీసుకెళ్లిన భారత దేశంలో ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కేసీఆర్ అన్నారు. ఈ రూ.5వేలను వెంటనే ఇవ్వం. మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3వేలు చేస్తాం. ‘ప్రతి సంవత్సరం 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు తీసుకెళ్తాం. దీనివల్ల ప్రభుత్వంపై ఒకేసారి భారం పడదు. పక్కన ఆంద్ర ప్రదేశ్ లో ఇదే తరహాలో అమలు చేసి విజయ వంతంగా జరిగింది అదేతరహాలో రాబోయే ప్రభుత్వంలో మనం చేసుకుంటాం’ కేసీఆర్.

అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 భృతి..

  • బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చకా.. ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వడీ నుంచి ప్రతి ఇంటిక సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ఇక రాష్ట్రంలో దొడ్డు బియ్యం బాధాలు ఉండవు.

పేద మహిళలకు 400కే గ్యాస్‌ సిలిండర్‌..

  • ప్రపంచంలో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు, గ్యాస్ ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపై అడ్డగోలుగా భారం మోపుతుంది. తెలంగాణలో చాలా మంది మళ్లీ గ్యాస్ స్టవ్ లు మానేసి కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. అందుకే అర్హలైన మహిళలకు రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దివ్యాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంపు..

  • తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు రూ. 4016 దాన్ని రూ. 6. వేలకు తీసుకెళ్లాం అన్నారు. వచ్చే సంవత్సరం తర్వాత రూ.5 వేలు చేసి. ప్రతి సంవత్సరం 300కి పెంచుతూ ఆరు వేలకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.

పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి..

  • పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మీ పథకం కింద బీపీఎల్ ఉన్న పేద మహిళలకు రూ. 3 వేల గౌరవ భృతి అందించనుంది.

కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది..

  • గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
    గతంలో ములుగు, భద్రద్రి కొత్త గుడెం జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు పంపిణి కార్యక్రమం చేసారు. అదే తరహాలో మళ్లి ఇతరులు పోడు పట్టాలు అందిస్తాం.

గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం..

  • రాబోయే రోజుల్లో గిరిజనులకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్నీ పథకాలను తెస్తాం. నూతన పథకలతో గిరిజనులకో లబ్ది చేకురేలా చేస్తాము.

ఆరోగ్య శ్రీ 15 లక్షలకు పెంపు..

  • గతంలో ఆరోగ్య శ్రీ పథకంలో ముందుగా 2 లక్షలు, నుంచి 5 లక్షలు పెంచింది. ఇప్పుడు మేనిఫెస్టో లో 5 లక్షలు పెంచుతు పూర్తిగా 15 లక్షలకు ఉచిత వైద్య సేవలు లబ్ది. ఆరోగ్య శ్రీ పథకం కు కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పార్టీ వాళ్లు పేరు పెట్టారు.

తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం..

  • రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగు చేస్తాం.

బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం..

  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు అమలు చేస్తున్న పథకాలల్లో ( గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ) వాటిల్లో ఎలాంటి మార్పులు లేకుండా యదావిధిగా పథకాలను కొనసాగిస్తాం

అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్..

  • ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రజలందరితో పాటు అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా రూ.400లకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని కేసీఆర్ హామీనిచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌ భరోసా..

  • సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌కు మార్చే విషయంలో స్టడీ చేయాలని నిర్ణయం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు అధ్యయన కమిటీ ఏర్పాటు చేయనున్నాం. నివేదిక ఆధారంగా ఓపీఎస్ పై నిర్ణయాలు తీసుకుంటాం.

అసైన్డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేత..

  • అసైన్డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేస్తాం. కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్నా ఆ భూములకు కోట్ల రూపాయల డిమాండ్‌ ఉంది. అలాంటి భూములు అమ్ముకుని మరోచోట పదెకరాల వరకు కొంటున్నారు. కానీ తమకు అలాంటి సదుపాయం లేదని, దాన్ని రిలీవ్‌ చేయాలని దళిత సోదరులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి దళితులకు హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తాం. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పిస్తాం.

నూతన పథకం..

అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ..

  • తల్లిదండ్రులు లేని అనాధల పిల్లలకోసం ప్రభుత్వం మరో కొత్త పాలసీని రుపోందిస్తుంది. దాని ద్వారా అనాధల పిల్లలకు లబ్ది చేకురుతుంది.

తెలంగాణ అన్న‌పూర్ణ ప‌థ‌కం : కింద ప్ర‌తి రేష‌న్ కార్డు హోల్డ‌ర్‌కు స‌న్న‌బియ్యం..

  • ఈ సారి కేసీఆర్ మరో నూతన పథకం తీసుకోచ్చారు. తెలంగాణలో ఆకలి కేకలు లేవు. హాస్టల్స్ లో పిల్లలకు సన్నబియ్యం, అంగన్ వాడీలో తో సహ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సన్న బియ్యం అందించనున్నారు. ఈ పథకం ప్ర‌తి రేష‌న్ కార్డు హోల్డ‌ర్‌కు వ‌చ్చే ఏడాది ఏప్రిల్, మే నుంచి స‌న్న‌బియ్యం ఇస్తాం. ఇక రాష్ట్రంలో దొడ్డుబియ్యం బాధ ఉండ‌దు. ఈ స్కీంకు తెలంగాణ అన్న‌పూర్ణ అని పేరు పెడుతున్నాం. ప్ర‌భుత్వంలోకి రాగానే ఈ స్కీం ను ఇంప్లీమెంట్ చేస్తాం. అని అన్నారు.

కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం : పేదలకు కేసీఆర్ బీమా

  • రాష్ట్రంలో తెల్లకార్డు కలిగిఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవితబీమా కల్పిస్తాం. వందశాతం ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తాం.

S.SURESH