BRS party : బీఆర్‌ఎస్‌లోకి అంబర్‌పేట్ శంకర్ పహిల్వాన్.. పోటీ ఎక్కడి నుంచి అంటే..
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడేకొద్దే బీఆర్‌ఎస్ పార్టీ తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను ఆకర్షించడంతో పాటు చిన్న స్థాయి కార్యకర్తలను కూడా ఆకర్షిస్తోంది. పార్టీతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రతీ ఒక్కరినీ కలుపుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే అంబర్‌పేట్ శంకర్‌ను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంది.

BRS party is trying to increase its strength as the elections in Telangana are approaching Amberpet Shankar has joined the BRS party under the leadership of Minister Harish Rao
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడేకొద్దే బీఆర్‌ఎస్ పార్టీ తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను ఆకర్షించడంతో పాటు చిన్న స్థాయి కార్యకర్తలను కూడా ఆకర్షిస్తోంది. పార్టీతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రతీ ఒక్కరినీ కలుపుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే అంబర్‌పేట్ శంకర్‌ను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంది. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అంబర్‌పేట్ శంకర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదారాబాద్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న అంబర్‌పేట్ శంకర్ మాజీ రౌడీ షీటర్. సిటీలో పేరు మోసిన చాలా మంది రౌడీలకు, పహిల్వాన్లకు బాస్ లాంటి వాడు అని అంతా చెప్తుంటారు. రాజకీయాలకు దూరంగా ఉండే అంబర్ పేట్ శంకర్ కొంత కాలంగా పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారు.
రాజకీయ నాయకులతో స్నేహం, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవకాశం వస్తే ఎన్నికల్లో పోటే చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా శంకర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కాస్ట్ బలం కూడా తోడవుతుంది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ శంకర్‌ను ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగూ టికెట్లు అందరికీ కన్ఫాం చేశారు కాబట్టి శంకర్ ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేదు. ఒకవేళ మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అంబర్‌పేట్ శంకర్ పొలిటికల్ ఎంట్రీతో ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌లో మంచి జోష్ కనిపిస్తోంది.