BRS : నేడు నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసనలు
తెలంగాణలో రైతులు ఎదర్కొంటున్న సమస్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

BRS protests in constituency centers today
తెలంగాణలో రైతులు ఎదర్కొంటున్న సమస్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వరికి రూ.500 బోనస ఇస్తామని ప్రకటించిన విషయంతెలిసిందే.. కాగా నేడు సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తానని సీఎం చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. అలాగే రైతుభరోసా ఇవ్వట్లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తిన కేసీఆర్.. BRS కార్యకర్తలు రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.