BRS : నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు..

నేడు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు ప్రారంభంచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2024 | 11:22 AMLast Updated on: Apr 06, 2024 | 11:22 AM

Brs Rythu Diksha Across Telangana Today

నేడు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు ప్రారంభంచింది. ఉదయం 11:30 గంటల నుంచి ఇవి ప్రారంభ మవుతాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ పాల్గొన్నారు. సంగారెడ్డి రైతుదీక్షలో తన్నీరు హరీశ్ రావు, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొనున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ శ్రేణులు ఈ దీక్షల్లో పాల్గొంటారు. “అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా పేరిట కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్కహామీని నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తున్నది.

ఇక గత ప్రభుత్వంలో రైతు బందు, కరెంట్ కోతలు వంటి లో ఎటాంటి జాప్యం జరగలేదని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంట్‌కోతలు, ధాన్యానికి రూ. 500 బోనస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటమే కాకుండా కాంగ్రెస్‌ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు” అని బీఆర్‌ఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అన్ని జిల్లా ల్లో రైతు దీక్షలు చేయనున్నది.