BSNL High Speed Net: బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఉచితంగా 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకునే అవకాశం

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ లేనిదే ఏ పని నడవదు. దీనికి కారణం మనం పూర్తిగా మొబైల్ డేటా, వైఫై జోన్ లో బ్రతికేస్తున్నాం. ఏ ఒక్క నిమిషం ఇంటర్ నెట్ కి అంతరాయం కలిగినా గిలగిలా కొట్టుకుంటాం. వీలైతే మన బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లో ఇంటర్నెట్ స్పీడును పెంచుకునేలా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. అలాంటి వారికి ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ ఎల్ ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకూ ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 02:10 PMLast Updated on: Aug 16, 2023 | 2:19 PM

Bsnl Will Provide Free 100 Mbps Data Speed In The Name Of Bharat Fiber Amrit Utsav

పంద్రా ఆగస్ట్ ను పురస్కరించుకొని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ అమృత్ ఉత్సవ్ పేరుతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఇది బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు ప్రయోనకరంగా మారనుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ను కలిగి ఉన్న వారు ఉచితంగా 100 ఎంబీపీఎస్ డేటా స్పీడ్ ను పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా 10 రోజుల పాటూ తమ డేటా స్పీడ్ ను పెంచుకొని వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం నెల రోజులు అంటే.. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబరు 15 వరకూ లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అయితే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరికీ కాకుండా కొందరికి మాత్రమే ఈ ఉచిత ఆఫర్ ను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ ఎఫ్ టీటీహెచ్ జోన్ లోని కస్టమర్ల కోసమే రూపొందించింది. ప్రతి నెలా రూ. 449, రూ. 499, రూ. 599, రూ. 666 ప్యాకేజీని వాడుతున్న వారికే లబ్ధి చేకూరుతుంది అని తెలిపింది. ఈ రీచార్జ్ ప్లాన్స్ లో ఏదైనా ప్రస్తుతం వినియోగిస్తున్నట్లయితే దీనిని ఎలా ఉపయోగించాలనే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా My BSNL App ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అందులో సంబంధిత మెయిల్ ఐడీ లాగిన్ అవ్వాలి.
  • ఆతరువాత FTTH అకౌంట్ నంబర్ ను నమోదు చేయాలి
  • అప్పుడు మీరు ఉపయోగించే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కు ఉచిత హై స్పీడ్ డేటా ను పొందేందుకు అర్హులా కాదా అని చూపిస్తుంది.
  • అలా చేసిన వెంటనే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కు సంబంధించిన ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని నమోదు చేసిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ విజయవంతమవుతుంది.
  • రిజిస్టర్ అయిన 48 గంటల్లోపు ఇంటర్నెట్ వేగం 100 ఎంబీపీఎస్ వరకూ పెరగడం గమనించవచ్చు.

T.V.SRIKAR