Bucket VS Gaju Glass : గ్లాస్‌కు పోటీగా బకెట్.. పవన్‌పై వైసీపీ కొత్త వ్యూహం..?
ఏపీలో రాజకీయ (AP Politics) సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ఎప్పుడు ఎవరు ఏ పార్టీ వీడతారో అర్థం కాని పరిస్థితి. వ్యక్తుల సంగతి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన (TDP-JanaSena)కూటమికి, వైసీపీకి మాత్రం పోరు తప్పదు అనేది క్లియర్. ఇలాంటి సిచ్యువేషన్‌లో జనసేన పార్టీకి (Jana Sena Party) పెద్ద షాక్ తగిలింది.

Bucket to compete with Glass.. YCP's new strategy against Pawan..?
ఏపీలో రాజకీయ (AP Politics) సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ఎప్పుడు ఎవరు ఏ పార్టీ వీడతారో అర్థం కాని పరిస్థితి. వ్యక్తుల సంగతి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన (TDP-JanaSena)కూటమికి, వైసీపీకి మాత్రం పోరు తప్పదు అనేది క్లియర్. ఇలాంటి సిచ్యువేషన్‌లో జనసేన పార్టీకి (Jana Sena Party) పెద్ద షాక్ తగిలింది. జాతీయ జనసేన పార్టీ పేరుతో, దాదాపు గాజ్ గ్లాస్‌ను పోలి ఉన్న బకెట్ గుర్తుతో కొత్త పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న జాతీయ జనసేన పార్టీని.. తిరుపతికి చెందిన నాగేశ్వర్ రావు అనే వ్యక్తి స్థాపించాడు. పుట్టింది ఏపీలోనే అయినప్పటికీ.. నాగేశ్వర్ రావు కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు.
ఏపీలో రానున్న ఎన్నికల్లో జాతీయ జనసేన పార్టీ (National Jana Sena Party) పోటీ చేయబోతోంది. ప్రస్తుతం జనసేన పార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిన గాజుగ్లాస్ గుర్తును తమకు కేటాయించాలంటూ జాతీయ జనసేన పార్టీ గతంలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కానీ అప్పటికే ఆ పార్టీకి బకెట్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో ఆ పార్టీ నేతల లేఖను అధికారులు తిరస్కరించారు. జనసేన పార్టీకే గాజుగ్లాస్ గుర్తును కేటాయించారు. కానీ జాతీయ జనసేన పార్టీకి కేటాయించిన బకెట్ గుర్తు కూడా దాదాపు గాజుగ్లాస్ మాదిరిగానే ఉంది. ఒకేలా ఉండే గుర్తులు ఎన్నికల్లో ఎలాంటి నష్టాన్ని తెస్తాయో ప్రత్యక్ష్యంగా చాలా సందర్భాల్లో రుజువైంది. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల గెలుపోటములను కూడా ఈ గుర్తులు డిసైడ్ చేశాయి.
ఓ పక్క ఏపీలో నెక్ టూ నెక్ ఫైట్ జరగబోతోంది. అంతా తమకు అనుకూలంగా వెళుతోంది అనుకున్న టైంలో జనసేన పార్టీకి ఈ గుర్తు కొత్త సమస్యగా మారింది. జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో ఈ పార్టీ కూడా పోటీ చేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తి0కమడపడే అవకాశముంది. ఇది జనసేన పార్టీకి పెద్ద దెబ్బ. మరోపక్క ఈ పని వైసీపీనే చేయించింది అనే వాదన కూడా ఉంది. జనసేన మద్దతుదారులను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ నేతలు ఇలా కొత్త పార్టీలను ఎంకరేజ్ చేస్తున్నారు అనే వాదన కూడా ఉంది. ఈ జాతీయ జనసేన పార్టీ వెనక ఎవరు ఉన్నారు అన్న విషయం పక్కన పెడితే.. బకెట్ గుర్తు మాత్రం పవన్ కళ్యాణ్‌కు ఏపీలో కొత్త సమస్యగా మారింది. మరి ఈ సమస్యను జనసేనాని ఎలా టాకిల్ చేస్తారో చూడాలి.