Budget 2024: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్.. ఆయుష్మాన్ భారత్ వర్తింపు..

పార్లమెంటులో వోటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ వివరాల్ని సీతారామన్ వెల్లడించారు. ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత బడ్జెట్‌లో ఈ స్కీమ్‌ కోసం రూ.7,200 కోట్లు కేటాయించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2024 | 03:45 PMLast Updated on: Feb 01, 2024 | 3:45 PM

Budget 2024 A Plus For Jobs In Tourism Deep Tech Infra No Change In Tax Slabs

Budget 2024: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్ పథకంలో వీరిని భాగస్వాముల్ని చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం.. పార్లమెంటులో వోటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ వివరాల్ని సీతారామన్ వెల్లడించారు. ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత బడ్జెట్‌లో ఈ స్కీమ్‌ కోసం రూ.7,200 కోట్లు కేటాయించారు.

Pawan Kalyan: యాత్ర2కు పోటీగా రాంబాబు.. ఏపీలో పోటా పోటీగా సినిమాలు

మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద రూ.88,956 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఈ పథకం ద్వారా అర్హులైనవారికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఇది క్యాష్‌లెస్ పథకం. బడ్జెట్‌లో కీలక వివరాలివి. ఆదాయ పన్నుపై ఉద్యోగులకు ఎలాంటి ఊరట దక్కలేదు. ఉద్యోగులకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. మోడీ ప్రభుత్వ విజయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఎలాంటి తాయిలాలు లేవు. కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 22శాతానికి తగ్గింపు. లక్షద్వీప్‌ను టూరిజం హబ్‌గా చేస్తామని నిర్మల ప్రకటించారు. టూరిజం ప్రమోషన్ కోసం వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే 5యేళ్ళల్లో పేదలకు 20 లక్షల ఇళ్ళు కట్టించనున్నట్లు హామీ ఇచ్చారు. కోటి మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. పీఎం స్వనిధి కింద మరో 2.3 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆదాయ పన్ను స్లాబ్ విధానం యధాతధంగా ఉంది. ఈసారి కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టారు. ఏడాదికి రూ.7 లక్షల ట్యాక్స్ పరిమితి పెంపు. 7 లక్షల దాకా ఎలాంటి పన్నులేదు. ఆదాయం పన్ను చెల్లింపును సులభతరం చేస్తామన్న ఆర్థికమంత్రి. 2023లో 3 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. రూ.3-6 లక్షల లోపు 5శాతం ట్యాక్స్. 6-9 లక్షల లోపు.. 6 లక్షలకు మించిన ఆదాయంపై రూ.15వేలు + 10శాతం. 9-12 లక్షల లోపు, 9 లక్షల కంటే ఎక్కువపై రూ.45వేలు+ 15శాతం. 2024లోనూ అదే ట్యాక్స్ విధానం అమలు చేస్తారు.