Jabardasth: జగన్‌కు క్షమాపణలు చెప్పిన జబర్దస్త్ యాక్టర్
జబర్దస్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో నుంచి జీరో స్టార్ట్ అయిన యాక్టర్లు.. ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నారు. ఈ షోలతోనే చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు.

Bullet Bhaskar apologized to CM YS Jagan for his skit to humiliate the Andhra Pradesh government
ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా బలపడ్డారు. అలాంటివారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు. ఐతే ఇప్పుడు జగన్ సర్కార్‌కు భాస్కర్ క్షమాపణ చెప్పాడు. దీనికి కారణం స్కిట్‌లో ఓ డైలాగ్. ఈ మధ్యే రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోతో బుల్లెట్ భాస్కర్ పై విమర్శలు మొదలయ్యాయ్. వైసీపీ శ్రేణులు భాస్కర్ టార్గెట్ చేశాయ్. ఈ నెల 7న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా పంచ్ డైలాగులు ఉన్నాయ్. స్కిట్‌లో ఓ పాత్రకు 2750 రూపాయల పెన్షన్ వస్తుంది. ఐతే అది పెరగదా అంటే అని ఆ పాత్ర అడిగితే.. ప్రభుత్వం మారితే పెరుగుతుందని మరో పాత్రతో డైలాగ్ ఉంటుంది.
ఇదే వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. ఏపీలో మాత్రమే 2750 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు బుల్లెట్ భాస్కర్‌కు చుక్కలు చూపించాయ్. ప్రస్తుతం ఏపీలో వృద్ధాప్య ఫించను కింద 2750 ఇస్తున్నారు. దీన్ని ఉద్దేశించి ఆ డైలాగులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తన స్కిట్లకు తానే డైలాగ్స్ రాస్తుంటారు బుల్లెట్ భాస్కర్. ఇలా స్కిట్లు పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతుండడంతో.. బుల్లెట్ భాస్కర్ రియాక్ట్ అయ్యాడు. కావాలని రాసిన డైలాగ్ కాదని.. ప్రభుత్వాలు మారినప్పుడు మాత్రమే పెన్షన్లు పెరుగుతాయనే చెప్పాలనుకున్నానే తప్పా.. మరో ఉద్దేశం లేదని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేశాడు బుల్లెట్ భాస్కర్.