CM KCR: సీఎం కేసీఆర్ నర్సాపూర్ సభలో బుల్లెట్ల కలకలం
సభకు వచ్చిన అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సభ ప్రాంగణంలోకి వస్తుండగా తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. అస్లాం అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు అతడిని తనిఖీ చేసి అదుపులోకి తీసుకొన్నారు.

Telangana assembly elections are fast approaching KCR CM KCR second phase election schedule released 54 meetings in 16 days
CM KCR: సీఎం కేసీఆర్ (CM KCR) పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు బయటపడటంతో కలకలం రేగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సీఎం కేసీఆర్ నర్సాపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో కొద్దిసేపు కలకలం రేగింది.
BANDI SANJAY: మసీదుకు వెళ్లినా రాముడినే మొక్కుతారు: బండి సంజయ్
సభకు వచ్చిన అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సభ ప్రాంగణంలోకి వస్తుండగా తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. అస్లాం అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు అతడిని తనిఖీ చేసి అదుపులోకి తీసుకొన్నారు. కాగా, అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందినవాడిగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అస్లాంపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.