అలసిపోయా..నావల్ల కావట్లే, వైరల్ గా బుమ్రా కామెంట్స్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రా వేసినన్ని ఓవర్లు, తీసినన్ని వికెట్లు మరే బౌలర్ తీయలేదు. ఒకవిధంగా చెప్పాలంటే మెషీన్ కంటే ఎక్కువగా అతను ఓవర్లు వేసినట్టు కనిపించింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రా వేసినన్ని ఓవర్లు, తీసినన్ని వికెట్లు మరే బౌలర్ తీయలేదు. ఒకవిధంగా చెప్పాలంటే మెషీన్ కంటే ఎక్కువగా అతను ఓవర్లు వేసినట్టు కనిపించింది. అతను ఏ స్థాయిలో అలసిపోయింది బూమ్రా మాటల్లోనే అర్థమైంది. బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా తప్ప మిగిలిన ఫాస్ట్ బౌలర్లు వికెట్ తీయలేకపోవడంతో అతన్ని కొనసాగిస్తూ వచ్చాడు రోహిత్ శర్మ.. నాలుగో రోజు సాయంత్రం ఆటలో బుమ్రా ఇంకో ఓవర్ వేయ్యి, ఆఖరి వికెట్ ఉంది..అని రోహిత్ శర్మ చెప్పగా.. తన వల్ల కావడం లేదనీ, పేస్ పడడం లేదంటూ బూమ్రా రిప్లై ఇవ్వడం స్టంప్ ఫోన్స్ లో రికార్డయింది. ఈ మాటలు విన్న మాజీ ఆటగాళ్ళు అతనిపై ఓవర్ వర్క్ లోడ్ పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.