ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్, నామినేషన్స్ లో బుమ్రా
గత ఏడాది మొత్తం సూపర్ ఫామ్ లో ఉన్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచాడు.
గత ఏడాది మొత్తం సూపర్ ఫామ్ లో ఉన్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచాడు. బుమ్రాతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా సీమర్ డేన్ పాటర్సన్ కూడా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ ముగ్గురిని నామినేట్ చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది వరుసగా రెండో సారి. నవంబర్ నెలలోనూ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయి విజేతగా నిలిచాడు. కాగా డిసెంబర్ లో జరిగిన మూడు టెస్టుల్లో బుమ్రా 22 వికెట్లు పడగొట్టాడు.