బుమ్రా వికెట్ల వేట, కుంబ్లే రికార్డు గల్లంతు
ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. సహచర బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకున్నా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు.
ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. సహచర బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకున్నా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాడు. తాజాగా బాక్సింగ్ డే టెస్టులోనూ బుమ్రా జోరు కొనసాగింది. 3 వికెట్లు తీయడం ద్వారా అరుదైన రికార్డు అందుకున్నాడు. మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. నిజానికి బుమ్రా ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడ్డాడు. అరంగేట్ర ప్లేయర్ సామ్ కోంటాస్ ధాటికి మూడేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో సిక్సర్ సమర్పించుకున్నాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి 6 ఓవర్లలోనే బుమ్రా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత పుంజుకున్న బుమ్రా.. కీలక వికెట్లు పడగొట్టాడు.
మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో బుమ్రా ఈ మ్యాచ్‌తో కలుపుకొని మూడు టెస్ట్‌లు ఆడాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే మూడు టెస్ట్‌లు, 6 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 14 వికెట్లతో, కపిల్ దేవ్ 14 వికెట్లతో, ఉమేశ్ యాదవ్13 వికెట్లతో ఉన్నారు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బూమ్రా ఇప్పటి వరకూ 24 వికెట్లు పడగొట్టాడు. ప్రతీ టెస్టులోనూ భారత్ కు కీలకంగా ఉన్నప్పటకీ మిగిలిన బౌలర్ల నుంచి సహకారం లేకపోవడంతో అతని పోరాటం కొన్ని సందర్భాల్లో వృథా అవుతోంది. దీనిపై ఇప్పటికే కెప్టెన్ రోహిత్ కూడా రియాక్టయ్యాడు. బుమ్రా ఒక్కడే ప్రతీసారీ మ్యాచ్ లు గెలిపించలేడని, మిగిలిన బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాలని గట్టిగానే చెప్పాడు. ఇదిలా ఉంటే బుమ్రా తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్స్‌ను సొంతం చేసుకున్న తొలి భారత పేసర్‌గా చరిత్రకెక్కాడు.
తన కెరీర్‌లో బుమ్రా 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకోవడం ఇదే తొలిసారి. భారత్ నుంచి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం 904 రేటింగ్ పాయింట్స్ అందుకున్నాడు. 2016లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత అశ్విన్ ఈ పాయింట్స్ సాధించాడు. 8 ఏళ్ల తర్వాత బుమ్రా తాజాగా ఈ ఫీట్ అందుకున్నాడు. ఓవరాల్‌గా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్లు ధాటిన 26వ ప్లేయర్‌గా బుమ్రా నిలిచాడు.