వరద బాధితులకు అండగా బన్నీ
సామాజిక సేవలతో పాటు, ఎవరికైనా ఆపద వస్తే ఆపన్నహస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్. ఇంతకు ముందు పలు మార్లు తన సహాయంతో మంచి మనసున్న కథానాయకుడిగా నిలిచిన బన్నీ, మరోసారి తన ఉదారతను చూపాడు.

సామాజిక సేవలతో పాటు, ఎవరికైనా ఆపద వస్తే ఆపన్నహస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్. ఇంతకు ముందు పలు మార్లు తన సహాయంతో మంచి మనసున్న కథానాయకుడిగా నిలిచిన బన్నీ, మరోసారి తన ఉదారతను చూపాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల, వరద ముంపులో చిక్కుక్కుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహార్నిశలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు. ఇక ఈ వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా కోటి రూపాయాల విరాళం అందించడానికి ముందుకు వచ్చారు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో భాదను కలిగిస్తుందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తను నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు అల్లు అర్జున్.