Weather Update : దేశ రాజధాని ఢిల్లీలో మండుతున్న ఎండలు..
తెలంగాణలో భిన్న వాతవరణం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాదిలో నైరుతి రుతుపవనాలు కాస్త చల్లగాలులు వీస్తు.. తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కానీ దేశ రాజధానిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది వాతవరణ పరిస్థితులు.

Burning sun in the national capital Delhi..
తెలంగాణలో భిన్న వాతవరణం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాదిలో నైరుతి రుతుపవనాలు కాస్త చల్లగాలులు వీస్తు.. తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కానీ దేశ రాజధానిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది వాతవరణ పరిస్థితులు. దేశ రాజధాని ఢిల్లీలో భానుడు భగ్గున మండిపోతున్నాడు. ఢిల్లీలో ప్రతి రోజు సగటుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఎండలతో పాటు వడగాల్పులు ప్రజలను వణికిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎండ వేడికి తాళలేక ఇవాళ ఐదుగురు వడదెబ్బతో మరణించారు. పదుల సంఖ్యలో ICU లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక రాజస్థాన్ రాష్ట్రం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఎందుకంటే అసలే ఎడారి ప్రాంతాం.. అందులోని వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రదేశం.. అక్కడ కూడా 49 డిగ్రీల నమోదైయ్యాయి. హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్‌లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.