Burrelakka Complaint on RGV: ఆర్జీవీపై బర్రెలక్క సీరియస్ ! మహిళా కమిషన్ కు ఫిర్యాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క సీరియస్ అయింది. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయిందని అనడంపై శిరీష్ మండిపడుతోంది. ఆమె తరపున లాయర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 06:31 PMLast Updated on: Dec 28, 2023 | 6:31 PM

Burrelakka Complaint On Rgv Womens Commission

సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ శిరీష…. ఇటీవల కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది.  తెలంగాణలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు 8 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి తరుచుగా బర్రెలక్క పేరును వాడుకుంటున్నారు వైసీపీ నేతలు.  ఈమధ్య వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఆర్జీవీ కూడా బర్రెలక్కపై విమర్శలు చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్కతో పవన్ ను పోలుస్తూ పవన్ కంటే బర్రెలక్కే బెటర్ అంటూ మాట్లాడారు. బర్రెలక్క బర్రెలను కాపలా కాస్తూ అటూ… ఇటూ తిప్పుతుంది.  కానీ సినిమాల్లో సూపర్ స్టార్ అయిన పవన్ చంద్రబాబు చేతిలో బర్రె లెక్క మారిపోయాడు అంటూ ఎద్దేవా చేశారు రాంగోపాల్ వర్మ. ఊరూ పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయింది… బర్రె లెక్క ఉంటుంది…. బర్రెలు లాగా ఆమె మాట కూడా వింటున్నారు…. అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని కామెంట్ చేసినట్టు లాయర్… మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై శిరిష్ ఫైర్ అవుతోంది. నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు…. కానీ మా ప్రాంత బిడ్డలు ఎదిగే ప్రయత్నం చేస్తుంటే… ఇలా కామెంట్ చేయడమేంటని బర్రెలక్క లాయర్ మండిపడ్డారు. ఆర్జీవీ మీద పోరాటం చేస్తామని హెచ్చరించారు. తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. తెలంగాణ నుంచి తరిమి కొడతామని లాయర్ హెచ్చరించారు.

ఆర్జీవి కామెంట్స్ పై పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. బర్రెలక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఫేమస్ అయితే ఆర్జీవీ లాంటి పరాన్నజీవి ప్రభుత్వానికి తొత్తుగా మారారు. జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని జగన్ చేతిలో బర్రెలాగా తయారయ్యారని అంటున్నారు.  ఆర్జీవీ కంటే ఆ బర్రెలక్క శిరీషయే చాలా బెటర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఆర్జీవికి అంతే ఘాటుగా సోషల్ మీడియాలో బదులు చెబుతున్నారు.