బై..బై..సన్ రైజర్స్, భువి ఎమోషనల్ వీడియో
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి కొందరు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగిలితే... మరికొందరు స్టార్ ప్లేయర్స్ కు జాక్ పాట్ తగిలింది. ఎవ్వరూ ఊహించని విధంగా కొందరు సీనియర్ ఆటగాళ్ళకు సైతం మంచి ధరే పలికింది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధరకు అమ్ముడయ్యాడు.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి కొందరు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగిలితే… మరికొందరు స్టార్ ప్లేయర్స్ కు జాక్ పాట్ తగిలింది. ఎవ్వరూ ఊహించని విధంగా కొందరు సీనియర్ ఆటగాళ్ళకు సైతం మంచి ధరే పలికింది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధరకు అమ్ముడయ్యాడు. మెగావేలంలో భువీ కోసం పలు ఫ్రాంచైజీలు గట్టిగానే ట్రై చేశాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. ఈ క్రమంలో భువి బిడ్ 10 కోట్లు దాటిపోయింది. చివరకు 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది. టీిమిండియాకు దూరమైనప్పటకీ దేశవాళీ క్రికెట్ లో మళ్ళీ ఫామ్ అందుకోవడం భువికి డిమాండ్ పెరిగినట్టు అర్థమవుతోంది. గత సీజన్ వరకూ సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహించిన భువి ఇక వచ్చే సీజన్ నుంచి బెంగళూరుకు ఆడనున్నాడు.
ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ టీమ్ తో పాటు హైదరాబాద్ ఫ్యాన్స్ కు భువనేశ్వర్ కుమార్ థ్యాంక్స్ చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నాడు. ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోను షేర్ చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి వీడ్కోలు చెబుతూ మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వనంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎమోషనల్ అయ్యాడు. తన ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు చెప్పాడు .
కాగా ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ భువీని వదిలేసింది. యువ ఆటగాళ్ళపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. దీంతో భువనేశ్వర్ ను వేలంలోకి కొనాలంటూ సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌కు అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశారు. కానీ కావ్యామారన్ వేలంలో భువీ కోసం ప్రయత్నించలేదు. భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 2013 నుంచీ 2024 సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ కే ప్రాతినిథ్యం వహించాడు. 2016లో 23 వికెట్లతో చెలరేగిన భువీ సన్ రైజర్స్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే గత రెండు సీజన్లలో పెద్దగా రాణించకపోవడంతో ఆరెంజ్ ఆర్మీ అతన్ని వేలంలోకి వదిలేసింది. కాగా మొత్తం ఐపీఎల్ కెరీర్ లో భువనేశ్వర్ 176 మ్యాచ్ లు ఆడి 181 వికెట్లు పడగొట్టాడు.