TG New Cabinet : కేబినెట్ విస్తరణ తేదీ ఖరారు? కొత్త మంత్రులు వీరే..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. జూ 4నా దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. దీంతో తెలంగాణలో నూతన ప్రభుత్వం మొదటి సారి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్లు వార్తులు వస్తున్నాయి..

Cabinet expansion date finalised? These are the new ministers..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. జూ 4నా దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. దీంతో తెలంగాణలో నూతన ప్రభుత్వం మొదటి సారి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్లు వార్తులు వస్తున్నాయి.. ఇక ఎట్టకేలకు జూన్ 10న తెలంగాణలో కేబినెట్ విస్తరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆరుగురు కొత్త వ్యక్తులు మంత్ర పదవి వరించనుంది.. ఏవరా కొత్త మంత్రులు అన్ని దానిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నేతలకు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.. కాగా కేబినేట్ రేసులో మదన్మోహన్రావు, సుదర్శన్ రెడ్డి, ప్రేమసాగర్, గడ్డం వివేక్, వినోద్, శ్రీహరి, మల్రెడ్డి రంగారెడ్డి, మైనంపల్లి, ఫిరోజాఖాన్ ఉన్నారు. ఇక మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం సీనియర్ నేతలు లాబియంగ్ చేస్తున్నారు.