Telangana Cabinet meeting : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ..
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి (Cabinet Meeting) సమావేశం జరగబోతోంది. ఎన్నికలు పూర్తయిపోయాయి.

Cabinet meeting chaired by CM Revanth Reddy today..
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి (Cabinet Meeting) సమావేశం జరగబోతోంది. ఎన్నికలు పూర్తయిపోయాయి. ఈ నేపథ్యంలో పాలన మీద రేవంత్ సర్కారు దృష్టి పెట్టింది. కీలక అంశాల గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్లో ఉన్న అంశాలు, రాష్ట్రానికి ఆదాయ వనరులు, ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. పూర్తి కాని అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ధరణి సమస్యలు, బ్యారేజీల మరమ్మత్తులు వంటి వాటి గురించి చర్చించబోతున్నారు. అలాగే రెండు లక్షల రుణమాఫీ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు.