CADBURY CHOCOLATE: ఆ చాక్లెట్స్ వెరీ డేంజర్.. ల్యాబ్ రిపోర్టులో తెల్ల పురుగులు
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌ను.. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ లాబొరేటరీకి అనాలసిస్ కోసం పంపారు. ఈ చాక్లెట్ పరిశీలించాక.. నమ్మలేని నిజాలను బయట పెట్టింది ఫుడ్ లాబొరేటరీ. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉన్నట్టు ఫుడ్ అనాలసిస్‌లో తేల్చింది.
CADBURY CHOCOLATE: క్యాడ్‌బరీ యాడ్ చూస్తే చాలు.. ఎవ్వరికైనా నోరూరుతుంది. ఒక్క ముక్కయినా సరే.. అలా.. అలా.. నోటిలో వేసుకోవాలని అనుకుంటారు చాలామంది. తియ్యని వేడుక చేసుకుందాం అంటూ ఆ చాక్లెట్ యాడ్ ప్రసారం అవుతుంది. కానీ అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ మీరు కొనుక్కొని తినడం.. మీ పిల్లలకు కొనిపెట్టడం మాత్రం చేయకండి. ఎందుకంటే.. ఆ చాక్లెట్ అంత డేంజర్ ఫుడ్ ఐటమ్ మరోటి లేదని ఆధారాలతో సహా బయటపడింది.
ఈనెల 9న హైదరాబాద్ రాబిన్ జాకెస్ అనే ఓ వ్యక్తి పిల్లల కోసం.. అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో క్యాడ్‌బరీ చాక్లెట్ కొన్నారు. అయితే అది ఓపెన్ చేయగానే.. అందులో బతికున్న పురుగు కనిపించింది. ఎక్స్‌పైరీ డేట్ కూడా దాటిపోయింది. వెంటనే దాన్ని వీడియో తీసి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. GHMCకి ఫిర్యాదు చేస్తూ ట్యాగ్ చేశారు. ఆ తర్వాత GHMC అధికారులు ఆ క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌ను.. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ లాబొరేటరీకి అనాలసిస్ కోసం పంపారు. ఈ చాక్లెట్ పరిశీలించాక.. నమ్మలేని నిజాలను బయట పెట్టింది ఫుడ్ లాబొరేటరీ. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉన్నట్టు ఫుడ్ అనాలసిస్‌లో తేల్చింది తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబొరేటరీ. ల్యాబ్ అనాలసిస్‌లో వైట్ వార్మ్స్ ఉన్నాయని గుర్తించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం ఇది డేంజర్ అని తేల్చింది. క్యాడ్బరీ రోస్ట్ ఆల్మండ్, ప్రూట్& నట్స్ చాక్లెట్స్ అంత సేఫ్ కాదంటూ రిపోర్టును విడుదల చేసింది.
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదని అధికారులు తేల్చి చెప్పారు. అందుకే చాక్లెట్స్ తినేవారు పూర్తిగా మానేయడం బెటర్. ఒకవేళ తినాలని కోరిక ఉంటే మాత్రం.. దాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం బెటర్. దానికి ఎక్స్‌పైరీ డేట్ ఇంకా ఉందా.. ఒక వేళ ఉన్నా.. కవర్ ఓపెన్ చేసి వెంటనే నోట్లో పెట్టుకోకుండా.. చాక్లెట్‌ను చెక్ చేసుకోవడం బెటర్ అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.