CAG Report: కాళేశ్వరంలో దోపిడీ నిజమే.. బీఆర్ఎస్ సర్కార్‌ని ఉతికారేసిన కాగ్

కాగ్ రిపోర్టులో ప్రాజెక్టులపై సంచలనాలు వెలుగు చూశాయి. కాగ్ రిపోర్ట్ ప్రకారం.. కాళేశ్వరం బడ్జెట్ అంచనాలకు మించి పెరిగింది. DPRలో రూ.63,352కోట్లు ఉండగా, తర్వాత రూ.1.06 లక్షల కోట్లకు పెరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 02:19 PMLast Updated on: Feb 15, 2024 | 2:19 PM

Cag Report On Kaleshwaram Project Says Project Cost Likely To Exceed 1 47 Lakh Crore As Against 81911 Crore

CAG Report: కాళేశ్వరంపై కాగ్‌ రూపొంందించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కాగ్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కాగ్ వివరాల్ని ప్రభుత్వం వెల్లడించింది. కాగ్ రిపోర్టులో ప్రాజెక్టులపై సంచలనాలు వెలుగు చూశాయి. కాగ్ రిపోర్ట్ ప్రకారం.. కాళేశ్వరం బడ్జెట్ అంచనాలకు మించి పెరిగింది. DPRలో రూ.63,352కోట్లు ఉండగా, తర్వాత రూ.1.06 లక్షల కోట్లకు పెరిగింది.

HARISH RAO: హరీష్‌కు ఫుల్‌ సపోర్ట్‌.. కేసీఆర్‌కు వెన్నుపోటు.. సీఎం సీటుపై హరీష్‌ కన్ను!

ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యే నాటికి ఖర్చు రూ.1.47 లక్షల కోట్లకు చేరుకుంది. కాళేశ్వరం ప్రస్తుత నిర్మాణంతో 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్లు అందుతాయి. నిర్మాణం ఖర్చు పెరిగినా అదనపు ప్రయోజనం లేదు. రీఇంజినీరింగ్, మార్పులతో అంతకుముందు చేసిన పనులు కూడా వృథా అయ్యాయి. కాళేశ్వరం రీడిజైన్‌తో రూ.765 కోట్లు వృధా ఖర్చు పెట్టారు. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ తొందరపాటుకు పాల్పడింది. డీపీఆర్ ఆమోదించకుండానే రూ.25వేల కోట్ల విలువైన 17పనులు అప్పగించింది. అవసరం లేకున్నా 3వ టీఎంసీ పనులు ప్రారంభించారు. 3వ టీఎంసీ పనులతో 25 వేల కోట్ల అదనపు ఖర్చు. కాళేశ్వరం వార్షిక ఖర్చులు కూడా తక్కువ చేసి చూపించారు. నీళ్ళు అమ్మకంతో రూ.1019 కోట్లు ఆదాయం వచ్చింది.

సాగునీటిపై మూలధన వ్యయం ఎకరానికి రూ.6.42 లక్షలు. లోన్ల కోసం 15 బ్యాంకులతో రూ.87వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్ట్ నిర్వహించాలంటే ఏడాదికి రూ.14,500 కోట్లు ఖర్చు అవుతుంది. రుణాల చెల్లించడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. భూకంపంపై స్టడీ చేయకుండానే మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టింది అప్పటి ప్రభుత్వం.