Telegraph Act : మనం మాట్లాడేది ప్రభుత్వం వినొచ్చా? టెలిగ్రాఫ్ చట్టం ఏం చెబుతుంది ?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంతో ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. భార్యా భర్తలు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ...ఇలా మనం ఎవరితో మాట్లాడుకున్నా... ప్రభుత్వానికీ... ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థకు (Police System) వినే అధికారం ఉందా. మనకు ప్రైవసీ లేదా ? మన స్వాతంత్ర్యంపు హక్కుకు భంగం కాదా ? అసలు టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) ఏం చెబుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2024 | 10:15 AMLast Updated on: Mar 30, 2024 | 10:15 AM

Can The Government Listen To Us What Does The Telegraph Act Say

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంతో ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. భార్యా భర్తలు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ …ఇలా మనం ఎవరితో మాట్లాడుకున్నా… ప్రభుత్వానికీ… ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థకు (Police System) వినే అధికారం ఉందా. మనకు ప్రైవసీ లేదా ? మన స్వాతంత్ర్యంపు హక్కుకు భంగం కాదా ? అసలు టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) ఏం చెబుతోంది.

తెలంగాణలో గత BRS హయాంలో విచ్చలివిడిగా ఫోన్ ట్యాపింగ్ కి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అవును తప్పేంటి… లాంగాల ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పేంటి… అని మాజీ మంత్రి కేటీఆర్ సమర్థించుకుంటున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు క్లియర్ గా ఒప్పుకున్నారు. రాజకీయనేతలు, వ్యాపారులు, రియల్టర్లు, జ్యుయలరీ వర్తకులు… హీరో, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. హైదరాబాద్ లోనే కాదు… జిల్లాల్లోనూ విచ్చలివిడిగా ఫోన్ ట్యాపింగ్ నడిచింది. ఈ ట్యాపింగ్స్ లో సంభాషణలను అడ్డం పెట్టుకొని మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు సహా 15 మంది అధికారులు గత ప్రభుత్వ పెద్దల అండతో చెలరేగిపోయారు. అందినంత దోచుకొని కోట్ల రూపాయలతో ఫామ్ హౌస్ లు, ఖరీదైన ఇళ్ళు కట్టుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. BRS ప్రభుత్వం ఇంత నిస్సిగ్గుగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడటం… పైగా దాన్ని సమర్థించుకోవడం జనం సహించలేకపోతున్నారు. మన ప్రైవేసీని భగ్నం చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారని మండిపడుతున్నారు.

టెలిగ్రాఫ్ చట్టం ఏం చెబుతుంది ?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు విచారణ ప్రారంభించినట్టు ఆ FIR లో టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లను చేర్చలేదు. ఇప్పుడు ఈ యాక్ట్ కింద పోలీస్ అధికారులపై కేసులు పెట్టాలని డిసైడ్ అయ్యారు. దేశ చరిత్రలోనే టెలిగ్రాఫ్ చట్టం కింద నమోదైన మొదటి కేసు ఇదే అవుతుంది. టెలిగ్రాఫ్ చట్టం ద్వారా మన రాజ్యాంగం పౌరులకు రక్షణ కల్పించింది. ఈ చట్టంలోని 25వ నిబంధన చాలా శక్తివంతమైనది. అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారికి మూడేళ్ళ దాకా జైలు శిక్ష పడుతుంది. ఇంకా కొన్ని నిబంధనల ప్రకారం నిందితులకు ఏకంగా పదేళ్ళ దాకా జైలు శిక్ష వేయాలని చట్టం చెబుతోంది. ఫోన్ ట్యాపింగ్స్ కి సంబంధించి సరైన ఆధారాలు దొరకడం లేదు కాబట్టి… ఇప్పటి దాకా ఈ చట్టం మీద ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరించారు. కేసును నిరూపించగలమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ యాక్ట్ ను ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు. కోర్టును పర్మిషన్ కూడా కోరారు.