Diwali : దీపావళి కి సెలవులు రద్దు.. కేంద్ర ఎన్నికల సంఘం..
నవంబర్ 13 సోమవారం నాడు దీపావళి (Diwali Festival) పండుగ సెలవును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆదివారం ఒక్కరోజే సెలవు (Holiday) ఇస్తున్నట్లు తెలిపింది. 13 సోమవారం దీపావళి సెలవు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రపోజల్ ను CEC తిరస్కరించింది.
నవంబర్ 13 సోమవారం నాడు దీపావళి (Diwali Festival) పండుగ సెలవును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆదివారం ఒక్కరోజే సెలవు (Holiday) ఇస్తున్నట్లు తెలిపింది. 13 సోమవారం దీపావళి సెలవు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రపోజల్ ను CEC తిరస్కరించింది. తమ షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 సోమవారంనాడు వివిధ ఎన్నికల సమావేశాలు, ఉద్యోగులకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి. సెలవు ఇస్తే అవన్నీ ఆగిపోతాయనీ అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను నిరాకరిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి ఏడాది లాగే తెలంగాణ సర్కార్ ఈ ఏడాది సెలవులను 2022 చివర్లోనే విడుదల చేసింది. అందులో దీపావళి సెలవును నవంబర్ 12 ఆదివారం నాడు ఇచ్చారు. అలాగే ఆప్షన్ హాలిడేగా నవంబర్ 13ను ప్రకటించారు.
దీపావళి అమావాస్య గడియలు నవంబర్ 13న కూడా ఉండటంతో.. ఆ రోజు పండగ జరుపుకోవాలని పండితులు సూచించారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం సెలవుల్లో మార్పులు చేసింది. నవంబర్ 13న సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నవంబర్ 13న ఆప్షనల్ హాలిడేగా ఇవ్వగా.. దాన్ని సవరించి దీపావళికి సాధారణ సెలవుగా మార్చింది. దాంతో పండుగ తర్వాత రోజు అంటే నవంబర్ 14 ఆప్షన్ హాలిడేగా వస్తుంది. ఈ మార్పు చేయడం వల్ల స్కూళ్ళు, కాలేజీలు, సర్కారీ ఆఫీసులకు రెండు శనివారం, ఆదివారం, దీపావళి సెలవు.. ఇలా మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి. కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ప్రభుత్వ ఆఫీసులు సోమవారం నాడు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ విద్యాసంస్థలకు సోమవారం సెలవు కొనసాగే ఛాన్సుంది.