Chikoti Praveen Kumar:బీజేపీలో చేరబోతున్న చికోటి ప్రవీణ్.. ఎక్కడి నుంచి పోటీ చేస్తాడంటే..
చికోటి ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పటి నుంచో తెలుస్తోంది. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. తాజాగా బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Casino King Chikoti Praveen Kumar Join In BJP
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ త్వరలోనే పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్వరలోనే ప్రవీణ్ బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 12న భారీ మొత్తంలో అనుచరులతో ప్రవీణ్ బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. క్యాసినో నిర్వహణ కేసుతో ప్రవీణ్ పేరు ఒక్కసారిగా రాష్ట్రావ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు.. ఇలా చికోటి చిట్టాలో లేని వ్యక్తులు లేరు.
దేశ విదేశాల్లో ప్రవీణ్‌కు ఉన్నా కాంటాక్ట్స్ చూసి అధికారులే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈడీ కేసు తరువాత చాలా మంది తమను తమను కాపాడుకునేందుకు తనను చంపాలని చూస్తున్నారంటూ ప్రవీణ్ సంచలణ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కూడా కోరారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్‌గా పాలిటిక్స్‌లోకి రాబోతున్నాడు. నిజానికి చాలా కాలం నుంచి ప్రవీణ్ బీజేపీలోకి రాబోతున్నాడంటూ టాక్ నడుస్తోంది. రీసెంట్‌గా బండి సంజయ్‌ని ఆయన ఢిల్లీలో కలిసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ప్రవీణ్ మాత్రం తాను వ్యక్తిగత పని మీద వెళ్లి సంజయ్ వచ్చారని తెలిసి కలిశానని వివరణ ఇచ్చాడు. కానీ ఇప్పడు అంతా అనుకున్నట్టుగానే బీజేపీలో చేరబోతున్నాడు ప్రవీణ్. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలి.