CBI Calls Kavitha : కవితకు పీకల్లోతు కష్టాలు… ఆ స్టేట్మెంటే ఇరికించింది..!!
BRS ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారించిన సీబీఐ మరోసారి ఈనెల 26న తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అప్పట్లో జూబ్లీహిల్స్ లో కవిత ఇంట్లోనే స్టేట్ మెంట్ రికార్డు చేసినా... ఇప్పుడు ఢిల్లీకి పిలవడంతో బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ లో ఉన్నాయి. ఆమెను మరోసారి పిలవడానికి మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంటే కారణమని భావిస్తున్నారు.
BRS ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారించిన సీబీఐ మరోసారి ఈనెల 26న తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అప్పట్లో జూబ్లీహిల్స్ లో కవిత ఇంట్లోనే స్టేట్ మెంట్ రికార్డు చేసినా… ఇప్పుడు ఢిల్లీకి పిలవడంతో బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ లో ఉన్నాయి. ఆమెను మరోసారి పిలవడానికి మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంటే కారణమని భావిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో BRS MLC కల్వకుంట్ల కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఈడీ వరుస నోటీసులపై సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్న ఆమెకు ఊహించని విధంగా..సీబీఐ నుంచి కూడా పిలుపు వచ్చింది. ఈనెల 26న తమ ముందు హాజరు కావాలని సీబీఐ అధికారులు కవితకు ఈ మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో కవితను సీబీఐ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో 7 గంటల పాటు విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు అధికారులు. ఆ తర్వాత ఈడీ విచారణకు కూడా హాజరైన కవిత… తాను వాడిన మొబైల్ ఫోన్లను అధికారులకు అందించారు.
ఇప్పుడు కవితను సీబీఐ పిలవడానికి కారణం… ఈ కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ అని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 100 కోట్ల రూపాయలు ముడుపులు స్వీకరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. సౌత్ గ్రూప్ లో కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు.
ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 28న ఈ కేసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి విచారించనుంది. ఈడీ నోటీసులు ఇచ్చిన నెలలోనే ఇప్పుడు సీబీఐ కూడా నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. CBI విచారణకు హాజరు కావాలా… నోటీసులకు సమాధానం ఇవ్వాలా వద్దా అన్న దానిపై కవిత న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్-బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయి… కవిత కేసు నీరుగారిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ టైమ్ లో మళ్ళీ నోటీసులు రావడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.