Security: ఒకరికి Y.. మరొకరికి Y +… టీబీజేపీ నాయకులకు కేంద్రం భద్రత..
ఇద్దరు తెలంగాణ బీజేపీ నేతలుక వై కేటరిగి భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై ప్లెస్, వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈటల రాజేందర్‌కు వై ప్లస్ కేటగిరి కల్పించగా.. ధర్మపురి అర్వింద్‌కు వై కేటగిరిని కేటాయించింది. భద్రతతోపాటు ఈ ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కేటాయించారు. తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని.. గతంలో ఈటల రాజేందర్ భార్య ఈటల జమున మీడియా ముందు చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల కూడా చెప్పడం ఆ మధ్య కలకలం రేపింది. భద్రత అడిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంత వరకు స్పందన లేదని ఈటల ఆరోపించారు. దీంతో కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని అంటున్నారు.
అటు ధర్మపురి అరవింద్ కాన్వాయ్ మీద గతంలో దాడి జరిగింది. ఆయన కూడా భద్రత కోరగా.. కేంద్రం రియాక్ట్ అయింది. ఇద్దరికి వై కేటగిరి భద్రతను కల్పించింది. ఇద్దరి నాయకుల ఇళ్లకు సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు చేరుకుని భద్రత ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌కి ఒక కమాండోతో సహా 8 నుంచి 11మందితో సెక్యూరిటీ కల్పిస్తారు. ఈటల రాజేందర్‌కు ఇద్దరు కమాండోలతో సహా 11మందికి పైగా భద్రతాసిబ్బంది ఉంటారు. వై ప్లస్ కేటగిరీ అనేది 2 నుంచి 4 కమాండోలు, పోలీసు సిబ్బందితో సహా 11 మంది సిబ్బందికి సంబంధించిన భద్రత ఉంటారు. Y కేటగిరీ అనేది ఒకరు లేదా ఇద్దరు కమాండోలు మరియు పోలీసు సిబ్బందితో సహా 8 మంది సిబ్బందికి భద్రత కల్పిస్తారు.