చాహల్ కు షాక్, హర్యానా టీమ్ నుంచి ఔట్
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు బ్యాడ్ టైం నడుస్తోంది. ఫామ్ లో ఉన్నప్పటికీ భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న చాహల్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్ లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు బ్యాడ్ టైం నడుస్తోంది. ఫామ్ లో ఉన్నప్పటికీ భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న చాహల్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్ లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భార్య ధనశ్రీ వర్మతో విడిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దేశవాళీ టోర్నీ విజయ్ హజారే కోసం ఎంపిక చేసిన హర్యానా జట్టులోనూ అతన్ని పక్కనపెట్టారు.
మంచి ఫామ్ లో ఉన్నా కీలకమైన నాకౌట్ మ్యాచ్ లకు చాహల్ ను ఎంపిక చేయకుండా పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ ప్రధాన స్పిన్నర్ చాహల్ ను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని హర్యానా క్రికెట్ అసోసియేషన్ అధికారి తెలిపారు. యువ స్పిన్నర్ పార్త్ వాట్స్‌కు ఎక్కువ అవకాశాలను ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.