Power Star Pawan Kalyan : పవన్ కటాక్షం ఒక్కోలా..?
ఇలా పరిస్తితి ఉంటే, పవన్ మాత్రం సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వటమే సినీ జనాలకు అంతుచిక్కట్లేదు. ఈ పరిస్థితి భీమ్లానాయక్ నుంచే ఉంది. మధ్యలో బ్రో కూడా వచ్చింది. ఇవన్నీ అయిపోయినా హరి హర వీరమల్లు పూర్తి కాలేదు. మరి సురేందర్ రెడ్డి మూవీ ఎలా..?

Chance for Power Star Pawan Kalyans flop director Surender Reddy Surender Reddy is telling the story to complete the shooting in 4 months it is also a political satire film targeting AP elections
పవర్ స్టార్ కటాక్షం కోసం ఎదురు చూస్తున్న క్రిష్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వటమే కాదు బల్క్ గా డేట్లిచ్చాడు. ఎప్పటి నుంచో హరి హర వీరమల్లు సగం షూటింగ్ పూర్తి చేసి పవర్ స్టార్ కటాక్షం కోసం క్రిష్ వేయిట్ చేస్తున్నాడు. నిర్మాత ఏ.ఎం రత్నం కూడా కల్లు కాయలు కాచేలా పవన్ కోసం ఎదురు చూస్తున్నాడు.
పవన్ నుంచి భారీ వరాన్ని అందుకున్న సూరీ..?
ఇలా పరిస్తితి ఉంటే, పవన్ మాత్రం సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వటమే సినీ జనాలకు అంతుచిక్కట్లేదు. ఈ పరిస్థితి భీమ్లానాయక్ నుంచే ఉంది. మధ్యలో బ్రో కూడా వచ్చింది. ఇవన్నీ అయిపోయినా హరి హర వీరమల్లు పూర్తి కాలేదు. ఎలక్షన్స్ తర్వాతే పవన్ డేట్లు ఇచ్చేలా ఉన్నాడు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కే టైం సరిపోవట్లేదనుకుంటుంటే, పవన్ విచిత్రంగా సురేందర్ రెడ్డి సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వటమే కాదు, మేలో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమనే డెడ్ లైన్ పెట్టాడట..
సురేందర్ రెడ్డికి ఆఫర్ వెనక చాలా పెద్ద లాజిక్..?
దీనికి కారణం సురేందర్ రెడ్డి 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా కథ చెప్పటం, అది కూడా ఏపి ఎలక్షన్స్ ని సూటయ్యే పొలిటికల్ సెటైర్ అవ్వటం, అన్నీంటికి మించి ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేసిన డీల్ అవ్వటం. త్రివిక్రమ్ ఇచ్చిన స్టోరీ లైన్ బేస్ చేసుకునే సురేందర్ రెడ్డి సినిమా ప్లాన్ చేశాడట. ఆ స్టోరీ లైన్ ఏ రైట్స్ డెవలప్ చేస్తారనే విషయం పక్కన పెడితే త్రివిక్రమ్ కటాక్షం పొందితే పవన్ పర్మీషం దక్కినట్టే అని మరోసారి ప్రూవ్ అయ్యిందనంటున్నారు.